బాలికలపై అత్యాచారం: 150 ఏళ్ల జైలుశిక్ష
రష్యన్ బాలికలపై అత్యాచారం చేసి.. ఎవరికైనా చెబితే తల నరికేస్తానని బెదిరించినందుకు అమెరికన్ పౌరుడికి రష్యా కోర్టు 150 ఏళ్ల జైలుశిక్ష విధించింది. యూసెఫ్ అబ్రమోవ్ (58) అనే ఈ వ్యక్తికి అమెరికన్, రష్యన్ పౌరసత్వాలు రెండూ ఉన్నాయి. ఇతడు తరచు రష్యా వస్తూ స్కూళ్లలో చదివే అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్నాడు. 2009 జూన్ నెలలో 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి, ఎవరికనా చెబితే ఆమె తల నరికి.. దాంతో ఫుట్‌బాల్ ఆడుకుంటానని బెదిరించాడు. కొన్ని నెలల తర్వాత అతడు మళ్లీ రష్యా వెళ్లి, మళ్లీ బాలికలపై అత్యాచారం చేశాడు.
పోలీసులకు చెప్పారన్న అనుమానంతో మరోసారి మార్చి నెలలో అక్కడకు వెళ్లి, అమ్మాయిలపై తన అనుచరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. బాధితులలో ఒక అమ్మాయిని విచారణ సందర్భంగా పిలిచి, అతడిని గుర్తుపట్టాలని కోరగా.. ఆమె అతడిని చూసి పెద్దగా అరుస్తూ నేలమీద కుప్పకూలిపోయింది. తర్వాత కోర్టులో నేల మీద తీవ్రంగా గాయపడిన ఓ జంతువులా పాకుతూనే ఉంది తప్ప లేవలేకపోయిందని జడ్జి రైట్ చెప్పారు. నిందితుడిపై నేరం రుజువైంది కాబట్టి అతడికి 45 ఏళ్ల జైలుశిక్ష విధించాలని కోరగా, జడ్జి మాత్రం 150 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అతడు ఇక విడుదలయ్యే అవకాశం లేదన్న విశ్వాసం బాధితులకు ఉంటుందని జడ్జి చెప్పారు.