అమెరికాలో సెక్స్‌ రాకెట్‌.. టాలీవుడ్‌ నిర్మాత అరెస్టు! | Tollywood film producer, wife held for sex racket in Chicago | Sakshi
Sakshi News home page

Jun 14 2018 1:07 PM | Updated on Apr 4 2019 3:25 PM

Tollywood film producer, wife held for sex racket in Chicago - Sakshi

అమెరికాలో టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైలెవల్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంలో షికాగోలో నివసిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్‌ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. ఈ కేసుకు సంబంధించి 42 పేజీల క్రిమినల్‌ ఫిర్యాదును తాజాగా షికాగో జిల్లా కోర్టులో సమర్పించడంతో షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 34 ఏళ్ల కిషన్‌ మోదుగుముడి అలియాస్‌ రాజు అలియాస్‌ శ్రీరాజు చొన్నుపాటిని గుర్తించారు. భారత వ్యాపారవేత్త అయిన కిషన్‌ టాలీవుడ్‌లో పలు సినిమాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడని షికాగో ట్రిబ్యున్‌ పత్రిక తన కథనంలో తెలిపింది. ఆ పత్రిక కథనం ప్రకారం.. కిషన్‌, ఆయన భార్య చంద్రలను గత ఏప్రిల్‌లో ఫెడరల్‌ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. వారికి ఇంకా బెయిల్‌ లభించలేదు. టాలీవుడ్‌కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వీరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కాృతిక కార్యక్రమాలు, కాన్ఫరెన్స్‌ల వద్ద నటీమణులతో శృంగారం పేరిట విటులను వీరు ఆకర్షిస్తున్నారు. విటులను ఆకర్షించేందుకు మొబైల్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు.

నటిని అమెరికాకు రప్పించి..!
ఒక చిన్నస్థాయి నటిని షోలో పాల్గొనే పేరిట అమెరికాకు రప్పించి.. ఇదేవిధంగా వ్యవహరించడంతో ఈ రాకెట్‌ గుట్టు రట్టయింది. ఈ కేసులో సదరు నటిని ప్రధాన బాధితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని బటయపెడితే.. అంతు చూస్తానని ఆ నటిని, ఆమె కుటుంబాన్ని ప్రధాన నిందితుడు కిషన్‌ హెచ్చరించారని వారు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే.. నీ సంగతి చూడటం నాకు పెద్ద విషయం కాదు. నీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. నువ్వు పెద్ద నటివి కాదు’ అని అతను బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు హాని చేకూర్చవద్దంటూ బాధితురాలు రాసిన మెయిల్‌ ఆధారంగా నిందితులైన దంపతులను అరెస్టు చేశారు. క్లయింట్లతో తదుపరి ‘డేట్‌’ ముగిసేవరకు ఉండాలంటూ దాదాపు నలుగురు నటీమణులను పాత అపార్ట్‌మెంట్లలో ఉండేలా నిర్వాహకులు బలవంతపెట్టారని, లైంగిక కలాపాల కోసం ఒక్క క్లయింట్‌ వద్ద మూడువేల డాలర్ల వరకు వసూలు చేసేవారని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు.

అమెరికా అంతటా జరిగే భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల వద్ద ‘కస్టమర్ల’ను ఆకర్షించేవారని తెలిపారు. బాధిత మహిళకు మంచి ఉద్యోగం కల్పిస్తామని ఆఫర్‌ ఇచ్చి నిర్వాహకులు సర్దిచెప్పారని తెలుస్తోంది. నిందితుడు కిషన్‌ భార్య చంద్ర (31) లైంగిక వ్యవహారాలకు సంబంధించిన చిట్టాపద్దులు రహస్యంగా నిర్వహించేదని, ఒక్కో నటి ఎన్నిసార్లు పాల్గొన్నది. ఎంత డబ్బు చేతులు మారింది తదితర వివరాలు ఆమె నమోదు చేసేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. దంపతుల ఇంటిపై దాడులు జరిపినప్పుడు వారి ఇంట్లోని మల్టిపుల్‌ జిప్‌లాక్‌ బ్యాగుల్లో 70 కండోమ్‌లు లభించాయని చెప్పారు. దంపతులు అరెస్టు కావడంతో వారి పిల్లలను వర్జినియాలోని బాలల సంరక్షణ అధికారుల ఆశ్రయంలో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement