మృత్యుంజయడు.. ఆరు గంటల పాటు వరద ఉధృతిలో,చుట్టూ పాములు.. | Ap Floods: Man Rescued After Hours Rescue Operation Kadapa | Sakshi
Sakshi News home page

మృత్యుంజయడు.. ఆరు గంటల పాటు వరద ఉధృతిలో,చుట్టూ పాములు..

Published Sat, Nov 20 2021 10:38 AM | Last Updated on Sat, Nov 20 2021 11:05 AM

Ap Floods: Man Rescued After Hours Rescue Operation Kadapa - Sakshi

సాక్షి,పెనగలూరు(కడప): పెనగలూరు మండలంలోని సిద్దవరం పంచాయతీకి చెందిన సింహాద్రి దిగువ సిద్దవరం వద్ద చెయ్యేరు నది వరద ఉధృతిలో చిక్కుకున్నాడు. శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రమాదకరమైన వరదలోనే ఉన్నాడు. మూడు గంటల పాటు ఆలయంలోనే ఉండి బయటకు రావాలని ప్రయత్నించి వరదనీటిలో కొట్టుకుపోయాడు.  

ధైర్యంగా చెట్టును పట్టుకొని పైకి ఎక్కి మూడు గంటల పాటు వరదలోనే ఉన్నాడు. చెట్టు సమీపంలో చుట్టూ పాములు కూడా ఉన్నట్టు తెలిపాడు. గాంధీనగర్‌ ఎస్టీ కాలనీకి చెందిన పెంచలయ్య, దుర్గయ్యలు ధైర్యం చేసి చాంతాళ్ల సహాయంతో చెట్టు వద్దకు వెళ్లి రక్షించారు. ఆరు గంటల పాటు వరద ఉధృతిలోనే ఉండి క్షేమంగా బయటపడడంతో అందరూ మృత్యంజయుడు సింహాద్రి అని అభినందించారు.

చదవండి: ఆశలు సమాధి: పదిరోజుల్లో వివాహం.. మహిళా కానిస్టేబుల్‌ మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement