
పుణే : బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడిని మహారాష్ట్ర పోలీసులు చాకచక్యంగా రక్షించారు. బుధవారం ప్రమాదవశాత్తూ 200అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని దాదాపు 16గంటల కఠోర శ్రమ అనంతరం గురువారం ఉదయం సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఆనంధానికి అవధుల్లేవు. అటు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
పుణే 70కి.మీ దూరంలో ఉన్న థ్రాడేండేల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రవి ఫాంథిల్ భిల్ అనే బాలుడు ఆడుకుంటూ సమీపంలోని పొలంలోతవ్విన బోరుబావిలో నిన్న సాయంత్రం 4.30 గంటలకు పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన బాలుని తల్లిదండ్రులు, ఇతర స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలతో కలిసి బాలుడి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చివరికి 16గంటల అనంతరం విజయం సాధించారు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడనీ, వైద్యులతో పరీక్షలు కూడా నిర్వహించామనీ ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. బాలుడు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడని తెలిపారు. కాగా బాలుడి తండ్రి పండిట్ భిల్ రహదారి నిర్మాణ కార్మికుడు.
Comments
Please login to add a commentAdd a comment