చెన్నై: నగరంలో ఆదివారం నిర్వహించిన మారథాన్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళలకు ఎదురయ్యే సమస్యలు, బ్రెస్ట్ కేన్సర్ పూ అవగాహన కల్పించేందుకు పింక్ థాన్ పేరిట దేశంలోనే అతిపెద్ద మహిళా మారథాన్ చెన్నై నిర్వహించారు. ఐల్యాండ్ గ్రౌండ్ నుంచి లైట్ హోస్ వరకు కొనసాగిన ఈ మారథాన్లో కూవం నదిపై చెక్కతో నిర్మించిన తాత్కాలిక వంతెన కుప్పకూలడంతో దాని మీద పరుగులు తీస్తున్న మహిళలు నదిలో పడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది మహిళల్ని రక్షించారు. గాయపడిన మహిళలకు ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు.