వాషింగ్టన్: అమెరికాలోని బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టిన కంటెయినర్ నౌకలోని భారతీయ సిబ్బందిలో 8 మంది స్వదేశం బయలుదేరారు. వీరు ఇండియా రావడానికి కోర్టు అనుమతిచ్చింది. నౌక బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టి మూడు నెలలు కావస్తోంది.
నౌకలోని మొత్తం 21 మంది సిబ్బందిలో ఇంకా నలుగురు నౌకలోనే ఉన్నారని బాల్టిమోర్ మారిటైమ్ ఎక్స్చేంజ్ తెలిపింది. మిగిలిన సిబ్బందిని మాత్రం బాల్టిమోర్‌లోని ఓ సర్వీస్ రెస్టారెంట్‌లో ఉంచారు. నౌక బ్రిడ్జిని ఢీకొన్న ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నందునే వీరిని ఇంకా అక్కడ ఉంచినట్లు సమాచారం.
నౌకలోని 21 మంది సిబ్బందిలో 20 మంది భారతీయులే. నౌక బాల్టిమోర్ నుంచి శుక్రవారం వర్జీనియాలోని నార్‌ఫోక్ బయలుదేరింది. అక్కడ దానిని రిపేర్ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని బాల్టిమోర్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జ్‌ను కంటెయినర్ నౌక ఢీకొనడంతో బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు నిర్మాణ కార్మికులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment