Baltimore
-
బాల్టిమోర్ బ్రిడ్జి ఘటన.. నౌకలోని 8 మంది సిబ్బంది భారత్‌కు
వాషింగ్టన్: అమెరికాలోని బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టిన కంటెయినర్ నౌకలోని భారతీయ సిబ్బందిలో 8 మంది స్వదేశం బయలుదేరారు. వీరు ఇండియా రావడానికి కోర్టు అనుమతిచ్చింది. నౌక బాల్టిమోర్ బ్రిడ్జిని ఢీకొట్టి మూడు నెలలు కావస్తోంది. నౌకలోని మొత్తం 21 మంది సిబ్బందిలో ఇంకా నలుగురు నౌకలోనే ఉన్నారని బాల్టిమోర్ మారిటైమ్ ఎక్స్చేంజ్ తెలిపింది. మిగిలిన సిబ్బందిని మాత్రం బాల్టిమోర్‌లోని ఓ సర్వీస్ రెస్టారెంట్లో ఉంచారు. నౌక బ్రిడ్జిని ఢీకొన్న ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్నందునే వీరిని ఇంకా అక్కడ ఉంచినట్లు సమాచారం. నౌకలోని 21 మంది సిబ్బందిలో 20 మంది భారతీయులే. నౌక బాల్టిమోర్ నుంచి శుక్రవారం వర్జీనియాలోని నార్ఫోక్ బయలుదేరింది. అక్కడ దానిని రిపేర్ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని బాల్టిమోర్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జ్‌ను కంటెయినర్ నౌక ఢీకొనడంతో బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు నిర్మాణ కార్మికులు మృతి చెందారు. -
USA: ‘బాల్టిమోర్’ బ్రిడ్జి పునఃనిర్మాణానికి 480 కోట్లు
వాషింగ్టన్: ఇటీవల నౌక ఢీకొని కుప్పకూలిన అమెరికాలోని బాల్టిమోర్ వంతెన నిర్మాణం కోసం ఫెడరల్ ప్రభుత్వం ప్రాథమికంగా 60 మిలియన్ డాలర్ల(రూ.480 కోట్లు) అత్యవసర నిధులను కేటాయించింది. ఈ మేరకు మేరీ లాండ్ గవర్నర్ వెస్‌మూర్ కోరిన వెంటనే ఈ నిధులను దేశ రవాణా, హైవే మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నిధులతో వంతెన శిథిలాలను నదిలో నుంచి తొలగించడంతో పాటు కూలిన భాగాన్ని మళ్లీ నిర్మించనున్నారు. కీలకమైన బాల్టిమోర్ వంతెనను వీలైనంత త్వరగా మళ్లీ నిర్మించేందుకు అవసరమైతే భూమిని ఆకాశాన్ని ఒకటి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. కాగా, మంగళవారం(మార్చ్ 29)న అర్ధరాత్రి ఒంటిగంటకు పటాప్కో నదిపై ఉన్న ఫ్రాన్సిన్ స్కాట్‌కీ బ్రిడ్జి భారీ కంటెయినర్ నౌక ఢీకొని కుప్పుకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రిడ్జిపై పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు నదిలో పడిపోగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో నలుగురు ఆజూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి.. ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది దుర్మరణం -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
బాల్టిమోర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. తాజాగా జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 37 మంది గాయాలపాలయ్యారు. బాల్టిమోర్‌లోని బ్లూక్లిన్ హోమ్స్‌లో ఆదివారం ఓ పార్టీ జరుగుతున్న సమయంలో అక్కడ చేరిన యువతపైకి గుర్తు తెలియని వ్యక్తులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వారు తమకు తెలపాలని పోలీసు విభాగం పౌరులను కోరింది. ఇలా ఉండగా, కాన్సాస్‌లో ఆదివారం ఉదయం జరిగిన మరో కాల్పుల ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. -
పిల్లల్ని చంపి, సూట్‌కేస్‌లో కుక్కి, కారు డిక్కీలో ఏడాది పాటు
వాషింగ్టన్: ఓ మహిళ ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా చంపి, మృతదేహాలను సూట్‌కేస్‌లో కుక్కి కారు డిక్కీలో పెట్టుకొని కొన్ని నెలలపాటు చక్కర్లు కొట్టిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. గతేడాది మేలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. బాల్టిమోర్‌లోని ఈస్ట్ కోస్ట్ నగరానికి చెందిన నికోల్ జాన్సన్ అనే మహిళ కారులో వెళుతుంటే పోలీసులు ఆపారు. కారు పత్రాలు చూపించకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జాన్సన్‌ను పోలీసులు వివరాలు అడుగుతుంటే.. ‘’మీరేం చేసిన నేను పట్టించుకోను..ఎందుకంటే మరో ఐదు రోజుల్లో నేను మీడియాకు సంచలనంగా మారబోతున్నాను అని చెప్పింది. మహిళ మాటలపై అనుమానం వచ్చి పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో జాన్సన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను విచారించగా.. అ మృతదేహాలు తన బంధువు పిల్లలవని చెప్పింది. ఏడేండ్ల మేనకోడలు, అయిదేళ్ల మేనల్లుడిని 2019లో అక్క తనకు అప్పగించిందని పేర్కొంది. మేనకోడలు తలను అనేకమార్లు నేలకేసి కొడితే తన చనిపోయిందని, డెడ్‌బాడీని కారులో దాచానని చెప్పింది. అనంతరం బాబును కూడా చంపానని వివరించింది. అయితే, పిల్లలను ఎందుకు చంపిందని కానీ మిగతా వివరాలు కానీ పోలీసులకు వెల్లడించలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. -
హోరా హోరీగా కేఎల్ఏపీ వాలీబాల్ గేమ్స్
మేరీల్యాండ్: కేఎల్ఏపీ(కేరళ-ఏపీ) వాలీబాల్ టోర్నమెంట్2016 పోటీలు మేరీల్యాండ్‌లో రసవత్తరంగా జరిగాయి. ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద ఆల్ ఇండియన్ టోర్నమెంట్‌గా నిర్వహించిన ఈ పోటీల్లో 30 జట్లు, 280 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి వాలీబాల్ పోటీలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ టోర్నమెంట్‌ను బాల్టిమోర్‌లోని యూఎమ్బీసీ క్యాంపస్‌లో నిర్వహించారు. తంపా ఎఫ్ఎల్, న్యూ జెర్సీ, న్యూయార్క్, చికాగో, మేరీల్యాండ్, విరినియా, కెనెడా టోరొంటో, వాంకోవర్, విండ్సర్ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లు కేఎల్ఏపీ 5వ సీజన్లో పాల్గొన్నారు. మొత్తం రెండు విభాగాల్లో పోటీలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లలో మొదటి విభాగంలో కేరళన్యూస్లైవ్.కామ్ ఛాంపియన్‌గా నిలువగా, రెండో విభాగంలో ఐరన్ క్లా విజేతగా నిలిచింది. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేఎల్ఏపీ వ్యవస్థాపక సభ్యులు విజోయ్ పట్టమాడి, వెంకటరెడ్డి యెర్రమ్, జాన్సన్ కడమ్కులతిల్, రామా రావు తుల్లూరిలు మాట్లాడుతూ.. యూఎస్ఏలోని తమ కమ్యూనిటీ, ఆటలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని తెలిపారు. మేరీల్యాండ్‌లోని కొందరు వాలీబాల్ ఆటగాళ్లు కలిసి కేఎల్ఏపీ ఆర్గనైజేషన్‌ను 2012లో స్థాపించారు. వీళ్లు ఆంధ్రప్రదేశ్(తెలంగాణ కలుపుకుని), కేరళలకు చెందినవారవ్వడంతో రెండు రాష్ట్రాల పేర్లతో కలిపి ఆర్గనైజేషన్ పేరు వచ్చేలా పెట్టారు. కేఎల్ఏపీ కమిటీ సభ్యులు రాజ్ కురుప్, మోహన్ మవుంగల్, జోస్ థామస్, బిజొ విత్యాతిల్, జాన్నీ, జోయ్, జీజో, గుర్రం వెంకట్, శ్రీనాథ్, కిషోర్, కే యలమంచిలి శ్రీనివాస్ రావు, ప్రదీప్, మాథ్యూ, వాసు పుట్ట, సంతోష్, సమినేని, కుకట్ల శ్రీనివాస్‌లతో పాటూ బాబీ, చంద్ర గిడుతురి, సుధీర్ చంద్రగిరీ, ఢీకొండ శ్రీనివాస్, సామినేని శ్రీనివాస్, హృతిక్(పండు), వెంకట్ పుచ్చకాయల హర్ష, రాజు లింగంపల్లి, శ్రీనాథ్ కంద్రు, అనిల్ సుదం అల్ల, ఫణి జలువంచ, రామ్ సువర్ణకంటి, సన్యాసిరావు, అరుణ్ ఫెర్నాండేజ్(ఏజే), కిషోర్ కొర్రపాటి, నవీన్ పేర్నేని(నాగ), సంతోష్, అనురాగ్, సురేష్ కుప్పిరెడ్డిలు టోర్నమెంట్ నిర్వహణలో తమ వంతు కృషి చేశారు. విల్డేలేక్ ఇంటర్ఫెయిత్ సెంటర్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నిర్వాహకులు విజేతలకు ట్రోపీలను అందించారు. విజేతలతోపాటూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులను ప్రదానం చేశారు. మొదటి విభాగం విజేతలు: తొలిస్థానం: కేరళన్యూస్లైవ్.కామ్ రన్నరప్: విండర్స్ స్పోర్ట్స్ క్లబ్ మూడో స్థానం: న్యూజెర్సీ బాద్షాజ్, ఐకోర్ కాన్వెస్ట్ రెండో విభాగం విజేతలు: తొలిస్థానం: ఐరన్ క్లా రన్నరప్: బాల్టిమోర్ కోబ్రాస్-బీ మూడో స్థానం: పీఎస్సీ రాకర్స్, ఓవింగ్స్ ల్యోన్స్