
బాల్టిమోర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. తాజాగా జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 37 మంది గాయాలపాలయ్యారు. బాల్టిమోర్‌లోని బ్లూక్లిన్ హోమ్స్‌లో ఆదివారం ఓ పార్టీ జరుగుతున్న సమయంలో అక్కడ చేరిన యువతపైకి గుర్తు తెలియని వ్యక్తులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వారు తమకు తెలపాలని పోలీసు విభాగం పౌరులను కోరింది. ఇలా ఉండగా, కాన్సాస్‌లో ఆదివారం ఉదయం జరిగిన మరో కాల్పుల ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.