Brooklyn City
-
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
బాల్టిమోర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. తాజాగా జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 37 మంది గాయాలపాలయ్యారు. బాల్టిమోర్‌లోని బ్లూక్లిన్ హోమ్స్‌లో ఆదివారం ఓ పార్టీ జరుగుతున్న సమయంలో అక్కడ చేరిన యువతపైకి గుర్తు తెలియని వ్యక్తులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వారు తమకు తెలపాలని పోలీసు విభాగం పౌరులను కోరింది. ఇలా ఉండగా, కాన్సాస్‌లో ఆదివారం ఉదయం జరిగిన మరో కాల్పుల ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. -
కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్
బాక్సింగ్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కాల్పుల శబ్దం వినిపించడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో స్టేడియం బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బ్రూక్లిన్ వేదికగా బార్క్లేస్ సెంటర్లో గెర్వొంటా డేవిస్, రొనాల్డో రొమేరో మధ్య బాక్సింగ్ ఫైట్ జరిగింది. పోరు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఎరీనాలోకి అగంతకుడు తుపాకీతో చంపడానికి వచ్చాడేమోనని భయపడిన ప్రేక్షకులు ఒకరినొకరు తోసుకుంటూ బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కాల్పులు జరిగింది బార్క్లే సెంటర్లో కాదని.. బయట జరిగాయని తేలింది. విషయం తెలుసుకున్న ప్రేక్షకులు శాంతించడంతో కాసేపట్లోనే పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చింది. కాగా అదే బార్క్లే సెంటర్‌కు జపాన్ టెన్నిస్ స్టార్ నయామి ఒసాకా కూడా వచ్చింది. అక్కడ జరిగిన అనుభవాన్ని ఒసాకా తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ''నేనప్పుడే బార్క్లే సెంటర్‌లోనికి వచ్చాను. అప్పుడే సడెన్‌గా నాకు కాల్పుల శబ్దం వినిపించడం.. ప్రాణభయంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడంతో నాకు భయమేసింది. వెంటనే పక్కనే ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్లిపోయి డోర్స్ క్లోజ్ చేసుకున్నాం. ఆ క్షణంలో మాకు ప్రాణం మీద ఆశ కలిగింది. నా జీవితంలో ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి అనుకుంటా'' అంటూ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గెర్వొంటో డేవిస్.. రొనాల్డో రెమోరోపై నాకౌట్ విజయం సాధించాడు. చదవండి: Viral Video: అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే! Scary moment as crowds pour back into Barclays Center, my fear was a shooting but those fears proved unfounded. pic.twitter.com/pcBdfwWplt — Ryan Songalia (@ryansongalia) May 29, 2022 DOWN GOES ROMERO 😱 #DavisRomero pic.twitter.com/nKDMPhD89h — CBS Sports (@CBSSports) May 29, 2022 -
క్యాష్ ఉన్నా కొనలేరు
(అద్దెకు మాత్రమే ఇవ్వబడును) పెళ్లి చేసి చూడు... ఇల్లు కట్టి చూడు అని ఓ పాతకాలం సామెత ఉందిలెండి. ఈ హైటెక్ యుగానికి ఇలాంటి సామెతలు అస్సలు పనికిరావు. ఎందుకంటారా? పక్కఫొటోలో చూడండి. మీకే తెలిసిపోతుంది. అమెరికాలోని బ్రూక్లిన్ నగరంలో ఈమధ్యే ఓపెన్ అయిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఇది. కాకపోతే దీన్ని ఇటుకమీద ఇటుకపేర్చి, రెడీమేడ్ కాంక్రీట్ మిక్స్చర్తో పైకప్పు నిర్మించి కట్టలేదు. ఏ ఇల్లయినా ఇలాగే కట్టాలి కదా అనకండి. ‘461 డీన్’ అనే పేరున్న ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ను మాత్రం ఇల్లుపై ఇల్లు పెట్టి నిలబెట్టారు. అవునండి... ఇది నిజం. బ్రూక్లిన్ నగరానికి దూరంగా ఉన్న ఓ నౌకాశ్రయంలో ఒక్కో ఇంటిని కట్టి... ఆ తరువాత వీటిని నగరం మధ్యలో బార్క్లే సెంటర్ పక్కనే ఉన్న స్థలంలో పేర్చారు. మొత్తం బిల్డింగ్‌లో 60 శాతం ఇలా మాడ్యులర్ పద్ధతిలో ఏర్పాటు చేశారు. ఫలితంగా భవన నిర్మాణం ద్వారా వెలువడే చెత్త మోతాదు 70 నుంచి 90 శాతం వరకూ తగ్గిపోవడమే కాకుండా ఇంధనం ఖర్చు దాదాపు 67 శాతం వరకూ తగ్గిందని ఈ భవనాన్ని డిజైన్ చేసిన షాప్ ఆర్కిటెక్ట్స్ సంస్థ అంటోంది. మొత్తం 363 అపార్ట్మెంట్లు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో స్టూడియో అపార్ట్మెంట్లు మొదలుకొని 2 బెడ్రూమ్ వరకూ వేర్వేరు సైజుల్లో అందుబాటులో ఉండటం విశేషం. స్టూడియో అపార్ట్మెంట్ 740 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ పైభాగంలో క్లబ్హౌస్తోపాటు ఇండోర్ గేమ్స్, పార్టీ రూమ్ తదితర ఏర్పాట్లు ఉన్నాయి. ఇంటి లోపలి ఫర్నిచర్, కిచెన్ లోపలి కౌంటర్ టాప్ దాదాపు అన్నీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో 32 అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి ఎత్తయిన మాడ్యులర్ భవనంగా రికార్డు సృష్టించింది. ఇంకో విశేషం ఏమిటంటే... ఈ అపార్ట్మెంట్లు ఏవీ అమ్మకానికి లేవు. అన్నింటినీ అద్దెకు మాత్రమే ఇస్తారు. ఇటీవల దీనికోసం లాటరీ నిర్వహించారు కూడా. మొత్తం 130 స్టూడియో అపార్ట్మెంట్లను అద్దెకు పొందేందుకు 84 వేల మంది దరఖాస్తు చేశారు. ఒక్క స్టూడియో అపార్ట్మెంట్ అద్దె ఎంతో తెలుసా? నెలకు 2450 డాలర్లు! సుమారు లక్షా 66 వేల 700 రూపాయలు.