ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : ఓ కంపెనీలో పని చేస్తున్న 18 మంది బాల కార్మికులకు రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మంగళ్లపల్లి గ్రామంలో ఉన్న రోహిణీ ఫీడ్ కంపెనీలో రెవెన్యూ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది బాలకార్మికులు పనిచేస్తుండటంతో వారిని రెస్క్యూ హోంకు తరలించి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బాధితులంతా బీహర్‌కు చెందిన వారిగా సమాచారం.
18 మంది బాలకార్మికులకు విముక్తి
Published Tue, Aug 25 2015 6:40 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement