చాకచక్యంగా చిన్నారిని రక్షించిన గ్రామస్తులు | Toddler rescued from borewell in Dausa | Sakshi
Sakshi News home page

చాకచక్యంగా చిన్నారిని రక్షించిన గ్రామస్తులు

Published Mon, Oct 5 2015 6:16 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

చాకచక్యంగా చిన్నారిని రక్షించిన గ్రామస్తులు

చాకచక్యంగా చిన్నారిని రక్షించిన గ్రామస్తులు

జైపూర్:  బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని  గ్రామస్తులు సురక్షితంగా కాపాడిన వైనం  ఆ గ్రామంలో ఆనందోత్సాహాల్ని నింపింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు సమీపంలో దౌసా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  బిహార్పుర గ్రామంలో  జ్యోతి మీనా ప్రమాదవశాత్తు బోరుబావిలో  పడిపోయింది.  

ఇంటివద్ద ఆడుకుంటూ సుమారు 50 అడుగుల లోతైన  బోరుబావిలో పడిపోయింది. దాదాపు12 గంటల కఠిన ప్రయత్నాల తర్వాత  గ్రామస్తులు సోమవారం తెల్లవారుజామున పాపను బయటకు తీయగలిగారు.  ప్రాథమిక చికిత్స అనంతరం దోసాలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారిని కోలుకుంటోందని వైద్యులు ప్రకటించారు.

ఈ సహాయ కార్యక్రమంలో ఎన్డీఆర్ఆఫ్ దళాలు, జిల్లా రక్షర దళాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో  గొయ్యిని  తవ్విన  గ్రామస్తులు పాపను రక్షించారని జిల్లా కలెక్టర్ ఎస్ ఎస్ పవార్ మీడియాకు తెలిపారు.  ముఖ్యంగా స్థానికం తయారు చేసిన ఇనుప రాడ్లు,  పగ్గాల ద్వారా పాపను రక్షించడంలో   గ్రామస్తులు చాలా చాకచక్యంగా వ్యవహరించారని ఆయన కొనియాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement