
రైలు కిందపడుతున్న ప్రయాణికుడిని కాపాడుతున్న పోలీస్
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కదులుతున్న రైలు నుండి పట్టాలపై పడబోయిన ప్రయాణికుడిని రైల్వే పోలీస్ చాకచక్యంతో రక్షించిన సంఘటన కారవార రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన కేంద్ర రక్షణ శాఖ అధికారి బీఎం దేసాయి (59)ని, కారవార రైల్వే పోలీస్ నరేశ్ రక్షించారు.
ఆదివారం దేసాయి ఒకటవ ప్లాట్‌ఫాం మీద ఉన్న లగేజీ తీసుకోవడానికి కదులుతున్న ట్రైన్ నుండి దిగబోతూ కాలుజారి పట్టాలపై పడబోయాడు. అంతలో ఈ దృశ్యాన్ని చూసిన నరేశ్ తక్షణం అప్రమత్తమై దేసాయిని కాపాడాడు. ఈ వీడియోను కొంకణ రైల్వే శాఖ విడుదల చేసి ప్రయాణికులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
చదవండి: నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు!
Comments
Please login to add a commentAdd a comment