ఢాకా: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడంతో శాంతి భద్రతలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో భారత్ వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు.
వివరాల ప్రకారం.. బంగ్లాలో అల్లర్లు కొనసాగుతున్న సందర్భంగా అనేక మంది పౌరులు ఆ దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. ఈ మేరకు భారత్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్ పోర్టల్‌లో ఓ మెసేజ్‌ను పెట్టారు. ఈ క్రమంలో..‘బంగ్లాదేశ్ వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు మూసివేస్తున్నాం. అస్థిర పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమిస్తాం అని తెలిపారు. ఇక, భారత్‌కు ఢాకాలో హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాషీ, ఖుల్నా, సిల్‌హెట్ నగరాల్లో కాన్సులేట్లు ఉన్నాయి.
Indian visa application centre at Bangladesh will remain closed till further notice and Bangladesh is set to form new interim government headed by Muhammad Yunus. The oath taking ceremony will be held at 8 pm on 08.08.2024.#MuhammadYunus #BangaldeshUnderAttack pic.twitter.com/Zanj8z3LfH
— Lokendra Dixit (@LokendraDixit12) August 8, 2024
ఇదిలా ఉండగా.. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఇప్పటికే పలువురు మన దేశంలోకి వచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కానీ, బీఎస్‌ఎఫ్ దళాలు వారిని అడ్డగించినట్టు సమాచారం. మరోవైపు.. ఒడిశా తీరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. 480 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పటిష్ట నిఘాను ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment