
టీమిండియాకు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఆతిథ్యం ఇచ్చింది.

న్యూయార్క్‌లోని కార్యాలయానికి భారత క్రికెట్ జట్టును ఆహ్వానించింది.

భారత దౌత్యవేత్తలు శ్రీప్రియా రంగనాథన్, బినయా ప్రధాన్ రోహిత్ శర్మ సేనకు సాదరంగా స్వాగతం పలికారు.

కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ సందర్భంగా ప్రసంగించారు. తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ, ద్రవిడ్‌లతో విరాట్ కోహ్లి సహా టీ20 ప్రపంచకప్-2024లో భాగమైన ఆటగాళ్లంతా పాల్గొన్నారు.

భారత రాయబార కార్యాలయ అధికారులు ఆటగాళ్లను మొమెంటోలతో సత్కరించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

టీమిండియా తొలిసారి న్యూయార్క్‌లో క్రికెట్ ఆడుతున్న తరుణంలో వారిని సముచితంగా గౌరవించాలని భావించినట్లు తెలిపింది.

ఈసారి భారత జట్టు వరల్డ్‌కప్ గెలవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపింది.

కాగా టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్‌కు వెస్టిండీస్‌తో కలిసి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. టీమిండియా లీగ్ దశలో తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది.
