honors
-
'వెటకార' పురస్కారాలు
ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా పురస్కారాలు, బిరుదులు, ఘన సత్కారాలు దక్కుతాయి. వివిధ రంగాలలోని ప్రతిభావంతులను సత్కరించే పద్ధతి పురాతన రాచరికాల కాలం నుంచే ఉండేది. అయితే రాజుల కాలంలో పురస్కారాలు, సత్కారాలు మాత్రమే ఉండేవి. వెటకారాలు ఉండేవి కావు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం విస్తరించాక, వెటకార పురస్కారాలు కూడా మొదలయ్యాయి.ఆధునిక ప్రపంచంలో ‘నోబెల్’ పురస్కారాలను అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తాం. బుకర్ ప్రైజ్, పులిట్జర్ అవార్డు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి వాటికి కూడా ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా ప్రపంచంలో గౌరవాదరణలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కొంత పేరు గడించినా, పరమ చెత్త ప్రదర్శనలు చేసేవారిని బహిరంగంగా వెటకారం చేయడానికి కూడా అవార్డులు ఉన్నాయి. ఇవి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అవార్డులు. నోబెల్ బహుమతికి బదులుగా ఇగ్ నోబెల్ బహుమతి, పులిట్జర్ బహుమతికి బదులుగా ఫూలిట్జర్ బహుమతి ఇలాంటి అవార్డులే! వివిధ రంగాలకు సంబంధించి ఇలాంటి వెటకార పురస్కారాలు మరిన్ని కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ∙పన్యాల జగన్నాథదాసుఇగ్ నోబెల్శాస్త్ర సాంకేతిక సాహితీ రంగాలతో పాటు ప్రపంచశాంతి కోసం పాటుపడే వారికి ఏటా ఇచ్చే నోబెల్ బహుమతులు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో అందరికీ తెలుసు. పనికిమాలిన పరిశోధనలు సాగించేవారికి ‘ఇగ్ నోబెల్’ బహుమతుల గురించి ఎక్కువమందికి తెలీదు. ‘ఇగ్ నోబెల్’ బహుమతులు ఇవ్వడాన్ని 1991లో మొదలుపెట్టారు. వెటకార పురస్కారాల్లో ఇగ్ నోబెల్ తీరే వేరు! ‘ఆనల్స్ ఆఫ్ ఇంప్రొబాబుల్ రీసెర్చ్ (ఏఐఆర్) అనే శాస్త్రీయ హాస్య పత్రిక 1991 నుంచి ఏటా ‘ఇగ్ నోబెల్’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పత్రిక సంపాదకుడు మార్క్ అబ్రహాం వినూత్న ఆలోచనకు ఫలితమే ‘ఇగ్ నోబెల్’ పురస్కారాలు. అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీతల చేతుల మీదుగా ‘ఇగ్ నోబెల్’ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. ‘ఇగ్ నోబెల్’ గ్రహీతలు వేదిక మీద ప్రసంగాలు చేస్తారు. ఈ కార్యక్రమం అసలు నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని తలపిస్తుంది. ‘ఇగ్ నోబెల్’ పురస్కారానికి ఎంపికైన వారికి ‘ఘనం’గా నగదు బహుమతి కూడా ఇస్తారు. ఎంతనుకున్నారు? అక్షరాలా వంద లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్ డాలర్లు కాదు లెండి, జింబాబ్వే డాలర్లు. అమెరికన్ డాలర్లలో ఈ మొత్తం విలువ 0.40 డాలర్లు (రూ.33.73) మాత్రమే! ఈ పురస్కారంలోని వెటకారం అర్థమైంది కదా!అసలు నోబెల్‌ను మించినన్ని విభాగాలు ఇగ్ నోబెల్లో ఉన్నాయి. బోటనీ, అనాటమీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీస్, డెమోగ్రఫీ, ప్రొబాబిలిటీ, ఫిజియాలజీ విభాగాల్లో ‘ఇగ్’ నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఈసారి ‘ఇగ్’నోబెల్ విజేతలు, వారి ఘనతలు ఒకసారి చూద్దాం:⇒ బోటనీ విభాగంలో ఈసారి ఇగ్ నోబెల్ పొందినవారు అమెరికన్ శాస్త్రవేత్త జాకబ్ వైట్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్‌లో పరిశోధనలు సాగిస్తున్న జపానీస్ శాస్త్రవేత్త ఫిలిపె యమషిటా. వీరిద్దరూ కనుగొన్న అద్భుతం ఏమిటంటే– కృత్రిమ మొక్కల కుండీలు ఉన్న పరిసరాల్లో నిజమైన మొక్కలను కూడా పెంచుతున్నట్లయితే, కృత్రిమ మొక్కల ఆకారాలను నిజమైన మొక్కలు అనుకరిస్తాయట! ప్రపంచానికి ఏ రకంగానూ పనికిరాని ఈ అద్భుతాన్ని కనుగొన్నందుకే వీళ్లకు ఈ పురస్కారం.⇒ అనాటమీ విభాగంలో ఈసారి ఏకంగా పదిమంది ఇగ్ నోబెల్‌ను పొందారు. వివిధ దేశాలకు చెందిన ఈ పరిశోధకులు మూకుమ్మడిగా ఒకే అంశంపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనాంశం నెత్తి మీద మొలిచే జుట్టు. భూమ్మీద ఉత్తరార్ధ గోళంలో ఫ్రాన్స్‌కు చెందిన 25 మంది పిల్లలను, దక్షిణార్ధ గోళంలో చిలీకి చెందిన 25 మంది పిల్లలను నమూనాగా తీసుకున్నారు. ఉత్తరార్ధ గోళంలోని పిల్లలతో పోల్చుకుంటే, దక్షిణార్ధ గోళానికి చెందిన పిల్లల్లో నెత్తి మీద జుట్టు అపసవ్య దిశలో రింగులు తిరిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.⇒ ఫిజిక్స్ విభాగంలో హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్ సి. లియావో ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. చనిపోయిన చేప కళేబరానికి బోలు గొట్టాన్ని కడితే, అది ప్రవాహానికి ఎదురీదగలదని తన పరిశోధనలో తేల్చారు. నిర్ణీత పరిస్థితుల్లో ఒక వస్తువు తన శక్తిని ఏమాత్రం ఉపయోగించుకోకుండానే ప్రవాహానికి ఎదురీదడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.⇒ మెడిసిన్ విభాగంలో జర్మనీలోని హాంబర్గ్ వర్సిటీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇగ్ నోబెల్ దక్కింది. తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించని నకిలీ మందుల కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించే నకిలీ మందులే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని వీరు కనుగొన్నారు.⇒ కెమిస్ట్రీ విభాగంలో ఆమ్స్టర్డామ్ వర్సిటీకి చెందిన టెస్ హీరమన్స్, ఆంటోనీ డెబ్లాస్, డేనియల్ బాన్, శాండర్ వూటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. ఆల్కహాల్ ప్రభావంతో మత్తెక్కి ఉన్న క్రిములను, మత్తు లేకుండా పూర్తి చలనశీలంగా ఉన్న క్రిములను క్రోమాటోగ్రఫీ పరిజ్ఞానంతో వేరుచేయవచ్చని వీరు కనుగొన్నారు.⇒ బయాలజీ విభాగంలో మినెసోటా వర్సిటీకి చెందిన ఫోరై్డస్ ఎలీ, విలియమ్ పీటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ దక్కించుకున్నారు. ఆవులు పాలు చేపడంపై నాడీ వ్యవస్థ పరోక్షంగా ప్రభావం చూపుతుందని వీరు కనుగొన్నారు. దీని కోసం వారు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ఒక ఆవు వెనుక నిలుచున్న పిల్లి దగ్గర ఒక కాగితం సంచిని పేల్చారు. అధాటుగా జరిగిన ఈ పరిణామంతో ఆవు పొదుగు నుంచి పాల చుక్కలు నేలరాలాయి.⇒ ఇగ్ నోబెల్ శాంతి బహుమతి అమెరికన్ మానసిక శాస్త్రవేత్త బి.ఎఫ్.స్కిన్నర్‌కు మరణానంతరం లభించింది. తన జీవిత కాలంలో ఆయన ఒక విచిత్రమైన అంశంపై ప్రయోగాలు సాగించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైనిక బలగాలు ప్రయోగించే క్షిపణుల్లో సజీవంగా ఉన్న పావురాలకు గూళ్లు ఏర్పాటు చేసి, వాటిని కూడా క్షిపణులతో పంపినట్లయితే, ఆ శాంతి కపోతాలు క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలవని ఆశించాడు.⇒ ప్రొబాబిలిటీ విభాగంలో ఫ్రాంటిసెక్ బార్టోస్ నేతృత్వంలోని చెక్ శాస్త్రవేత్తల బృందానికి ఈసారి ఇగ్ నోబెల్ లభించింది. ఒక నాణేన్ని బొమ్మ బొరుసు వేసేటప్పుడు దానిని ఏవైపు పైకి ఉంచి పట్టుకుంటామో, ఎక్కువ సార్లు అదేవైపు తిరిగి నేల మీదకు పడుతుందని వీరు కనుగొన్నారు. ఈ సంగతిని కనుగొనడానికి ఏకంగా 3,50,757 సార్లు నాణెంతో బొమ్మ బొరుసు వేశారు.⇒ డెమోగ్రఫీ విభాగంలో ఇగ్ నోబెల్ ఈసారి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త సాల్ జస్టిన్ న్యూమన్కు దక్కింది. జనన మరణాల రికార్డులను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనే ఎక్కువమంది దీర్ఘాయుష్కులు ఉంటున్నట్లు ఆయన ఒక రహస్య పరిశోధన ద్వారా కనుగొన్నాడు.⇒ ఫిజియాలజీ విభాగంలో ఇగ్ నోబెల్‌ను జపానీస్ శాస్త్రవేత్త ర్యో ఒకాబే నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్కించుకుంది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల స్తన్యజీవులపై పరిశోధనలు జరిపి, స్తన్యజీవులు ఆసనం ద్వారా కూడా శ్వాసక్రియ సాగించగలవని తేల్చారు.మరికొన్ని వెటకారాలుగోల్డెన్ కేలా: అంతర్జాతీయ సినిమా రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన సంగతే! ఏటా అత్యుత్తమ సినిమాలకు, వాటిలో నటించిన నటీ నటులకు, దర్శకులు సహా ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ఇస్తారు. ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే బాలీవుడ్లో అతి చెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో కొన్నేళ్లుగా ‘గోల్డెన్ కేలా’ అవార్డులు ఇస్తున్నారు. ‘ర్యాండమ్ మ్యాగజీన్’ అనే హాస్యపత్రిక ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఈసారి ‘బచ్చన్ పాండే’ చిత్రం అతిచెత్త చిత్రంగా ‘గోల్డెన్ కేలా’ పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఫర్హద్ సమ్జీ, ఇందులో నటించిన అక్షయ్ కుమార్, కృతి సనోన్ ‘గోల్డెన్ కేలా’ పొందారు.గోల్డెన్ రాస్బరీ: ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే అతిచెత్త హాలీవుడ్ చిత్రాలకు కొన్నాళ్లుగా ‘గోల్డెన్ రాస్బరీ’ అవార్డులు ఇస్తున్నారు. అమెరికన్ ప్రచారకర్త జాన్ జె.బి. విల్సన్ నెలకొల్పిన ‘గోల్డెన్ రాస్బరీ ఫౌండేషన్’ ద్వారా ఏటా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఈ అవార్డులు తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ముఖం చాటేసినా, కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, వీటిని అందుకోవడం విశేషం. ఈ అవార్డును స్వయంగా అందుకున్న వారిలో టామ్ గ్రీన్, సాండ్రా బులక్ వంటి ప్రముఖులు ఉన్నారు.బిగ్ బ్రదర్ అవార్డు: పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. జార్జ్ ఆర్వెల్ నవల ‘1984’లోని ‘బిగ్ బ్రదర్’ పాత్ర స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పారు. గోప్యతకు భంగం కలిగించే అంశాలపై ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు, ఈ అంశాలపై చర్చను రేకెత్తించేందుకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రైవసీ ఇంటర్నేషనల్’ ఈ అవార్డులను ఇస్తోంది. ఆర్వెల్ ‘1984’ నవలకు యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 1999 నుంచి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫిన్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ‘బిగ్ బ్రదర్’ అవార్డులు ఇస్తున్నాయి.పిగాసస్ అవార్డు: ఇదొక విచిత్రమైన అవార్డు. అతీంద్రియ, మానవాతీత మాయలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. కెనడియన్–అమెరికన్ రచయిత, ఐంద్రజాలికుడు జేమ్స్ రాండీ 1982లో ఈ అవార్డును నెలకొల్పారు. ఇజ్రాయెలీ–బ్రిటిష్ ఐంద్రజాలికుడు యూరీ గెల్లర్ పేరుతో ఈ అవార్డును ‘యూరీ ట్రోఫీ’ అని కూడా అంటారు. ఈ అవార్డు లోగో ‘రెక్కల పంది’ కావడంతో ఇది ‘పిగాసస్’ అవార్డుగా పేరు పొందింది. మానవాతీత మానసిక శక్తులతో అత్యధిక సంఖ్యలో జనాలను మభ్యపెట్టిన వ్యక్తులకు, అతీంద్రియ కథనాలను వాస్తవ కథనాల్లా ప్రచురించే మీడియా సంస్థలకు, అతీంద్రియ అంశాలపై అధ్యయనాల కోసం నిధులు సమకూర్చే సంస్థలకు, ఒక వెర్రిబాగుల అంశాన్ని అతీంద్రియ ప్రభావంగా ప్రకటించే శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఇస్తారు.ఘంటా అవార్డు: బాలీవుడ్‌లోని అతిచెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డు ఇది. బాలీవుడ్ దర్శక నిర్మాత, రచయిత కరణ్ అంశుమాన్, ఆయన మిత్రుడు ప్రశాంత్ రాజ్‌ఖోవా 2011లో ఈ అవార్డును నెలకొల్పారు. అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమానికి స్వయంగా హాజరై, అవార్డులు తీసుకోవడానికి చాలామంది ముఖం చాటేస్తారు. అయితే, బాలీవుడ్ హీరోలలో రితేశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఈ అవార్డుల వేడుకకు హాజరై, స్వయంగా అవార్డులు అందుకోవడం విశేషం.పురస్కారాల చరిత్రపురస్కార సత్కారాల గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలి పురస్కారం ఎవరు పొందారో, దానిని ఎవరు ఇచ్చారో స్పష్టమైన ఆధారాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. ఏదో ఒక రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, గొప్ప ఘనత సాధించిన వారికి పురస్కారాలు అందజేసే పద్ధతి శతాబ్దాలుగా ప్రపంచమంతటా ఉంది. ప్రాచీన కాలంలో రోమన్ పాలకులు పురస్కారాలు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టి ఉంటారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికే రోమన్ పాలకులు తమ పౌరులకు పురస్కారాలను బహూకరించేవారు. సైనిక విజయాలలో కీలక పాత్ర పోషించిన సైనికులకు, సామాజిక పురోగతికి కృషి చేసినవారికి, రాజ్యం పట్ల విధేయత కలిగిన వారికి పురస్కారాలను ప్రకటించి, వారిని బహిరంగ వేదికపై ఘనంగా సత్కరించేవారు. మధ్యయుగాల నాటికి పురస్కార సత్కారాదులు ఆనాటి రాజ్యాలన్నింటికీ వ్యాపించాయి. ఆనాటి యూరోపియన్ రాజ్యాల్లో వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్ల్సిల్ బెల్స్, ఆర్నేట్ కప్పులు, కిప్ కప్పులు వంటివి బహూకరించేవారు. వీటిని బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా క్రీడా పోటీల్లో బహూకరిస్తున్న కప్పులు ఆనాటి కిప్ కప్పుల నమూనానే అనుసరిస్తుండటం విశేషం. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాజ్యంలో కింగ్ హెన్రీ–VIII హయాంలో వివిధ రకాల క్రీడా పోటీలకు ఆదరణ బాగా ఉండేది. కింగ్ హెన్రీ–VIII కాలంలో ఏటా రకరకాల క్రీడల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేసేవారు. ఆ కాలంలో విలువిద్య పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. ఈ పోటీల్లో విజేతలకు ‘స్కార్టన్ సిల్వర్ యారో’ అనే వెండి బాణాన్ని ప్రత్యేకమైన కర్రపెట్టెలో భద్రపరచి బహిరంగ వేదికపై బహూకరించేవారు. క్రీడాకారులతో పాటు కవులను, పండితులను, కళాకారులను కూడా ఆనాటి రాజులు ఘనంగా సత్కరించేవారు. బహుమానాలుగా విలువైన భూములను, భవంతులను, వెండి బంగారాలను ఇచ్చేవారు. కాళ్లకు గండపెండేరాలను, చేతులకు కంకణాలను తొడిగేవారు. వివిధ విద్యలలో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కనకాభిషేకాలు, గజారోహణలు వంటి సత్కారాలను కూడా ఘనంగా చేసేవారు.ఇలాంటివి మరిన్ని అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో వెటకారంగా ఇచ్చే ఈ పురస్కారాలను స్వయంగా స్వీకరించే వారి సంఖ్య మాత్రం ఎప్పుడూ తక్కువే! పాత్రికేయ రంగంలో పులిట్జర్ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. తప్పుడు కథనాలతో ఊదరగొట్టే పాత్రికేయులు, మీడియా సంస్థల కోసం కొందరు ఔత్సాహికులు ‘ఫూలిట్జర్ అవార్డు’ నెలకొల్పారు. గందరగోళంగా ఇంగ్లిష్ రాసేవారికి ‘గోల్డెన్ బుల్’ అవార్డు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థల మీద కోపంతో కొన్నేళ్ల కిందట ‘ఫేక్ న్యూస్ అవార్డు’ నెలకొల్పారు. క్రీడా పోటీల్లో అతిచెత్త ఆటతీరు కనబరచిన క్రీడాకారులకు ‘వుడెన్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. అతీంద్రియ పరిశోధకులకు ‘బెంట్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చెత్త ఆధునిక కళాఖండాలను సృష్టించేవారికి ‘టర్నిప్ ప్రైజ్’ ఇస్తున్నారు. వెటకారంగా ఇచ్చే ఇలాంటి పురస్కారాలు ఇంకా చాలానే ఉన్నాయి. జనాలకు ఇదో రకం వినోదం. -
USA: టీమిండియాను సత్కరించిన ఇండియన్ ఎంబసీ(ఫొటోలు)
-
డిగ్రీ చదివినా తక్షణ ఉపాధి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మార్పులొస్తున్నాయి. విదేశీ అధ్యయనాల మేరకు బోధన ప్రణాళికలు రూపొందుతున్నాయి. పారిశ్రామిక అవసరాలే గీటురాయిగా డిగ్రీలో నైపుణ్యాన్ని మేళవిస్తున్నారు. మూడేళ్ళ స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు వస్తున్నాయి. డిగ్రీ చేసినా ఉపాధి ఖాయమనే భరోసా కల్పిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనర్స్ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ళతో పరిమితంగా ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విధంగా ప్రవేశపెడుతున్న అనేక మార్పుల పురోగతిని కేంద్ర విద్యాశాఖ ఇటీవల సమీక్షించింది. మరోవైపు కాంబినేషన్ కోర్సులు, తక్షణ ఉపాధి అవకాశాలున్న స్కిల్ అనుసంధాన కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని యూజీసీ తన నివేదికలో పేర్కొంది. ఇక మీదట సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో సాంకేతికత తోడైన డిగ్రీ కోర్సులు ప్రాచుర్యం పొందుతాయని తెలిపింది. కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల మేళవింపుతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్ట్స్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం, సైన్స్‌తో సామాజిక అవగాహన కోర్సులు కలగలిపి రాబోతున్నాయి. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను యూజీసీ ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో క్రెడిట్స్ విధానం అమలులోకి రాబోతోంది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. క్రెడిట్ విధానం బెస్ట్ డిగ్రీ పట్టాలు ఇక క్రెడిట్స్ ఆధారంగా ఉండనున్నాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్ల ను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలా గే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చే స్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకా శం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసు కు న్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నా లుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఆనర్స్ వైపు ఆకర్షణ తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూజీసీ రూపొందించింది. తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు ఆనర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అక్కౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. ఇక బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్లల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. నైపుణ్యం వెలికితీసేలా మూల్యాంకనం విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే మూల్యాంకన విధానం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. డిగ్రీ కోర్సులు ఇక మీదట పూర్తి నైపుణ్యంతో అందించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రయోగం మొదలైంది. భవిష్యత్‌లో దీని వేగం పెరుగుతుంది. ఇక మీదట డిగ్రీ కోర్సు చేసినా మంచి ఉపాధి పొందుతారనే విశ్వాసం విద్యార్థుల్లో వస్తుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
14 నుంచి ‘వలంటీర్లకు వందనం’
సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా.. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వివిధ సంక్షేమ పథకాల అమలులో వారధులుగా పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లను ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా సత్కరించనుంది. కనీసం ఏడాదిపాటు వలంటీర్‌గా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులకు తావులేని మొత్తం 2,33,719 మంది వలంటీర్లను ఈ ఏడాది సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం దాదాపు నెల రోజులపాటు సచివాలయాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమాలు కొనసాగుతాయి. సీఎం వైఎస్ జగన్అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్టు 15వ తేదీన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్న వలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏటా ఉగాది సందర్భంగా ‘వలంటీర్లకు వందనం’ పేరుతో ఈ సత్కారాలను నిర్వహిస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను 2021 ఏప్రిల్ 14న వలంటీర్ల సత్కారాల కార్యక్రమం నిర్వహించగా.. మరుసటి ఏడాది ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఉగాది సమయంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వం వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అవార్డులతో పాటు నగదు పురస్కారం ♦ ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ పురస్కారం, రూ.30 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్తో సత్కరిస్తారు. ♦ ప్రతి మండలం, మునిసిపాలిటీ నుంచి ఐదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి 10 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4,220 మందికి ‘సేవారత్న’ అవార్డు, రూ. 20 వేల నగదు, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్ అందజేసి సత్కరిస్తారు. ♦2,28,624 మందికి ‘సేవావిుత్ర’ పురస్కారం, రూ.10 వేల నగదు అందజేస్తారు. ♦వలంటీర్ల పనితీరు, ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వలంటీర్ల హాజరు, ప్రతి నెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ, వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు వివరాల నమోదు తదితర అంశాల ఆధారంగా సేవా వజ్ర, సేవారత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు వెల్లడించారు. -
ఈ ఏడాది నుంచే ‘ఆనర్స్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఆనర్స్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. సీఎం జగన్ సమీక్ష అనంతరం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. ♦విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ సహా వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నందున ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ 90 శాతానికి పెరగాలి. 3 ఏళ్ల డిగ్రీ, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే అమలు. వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లోనూ ఆనర్స్ విధానం. ♦నాలుగేళ్ల బీఈ, బీటెక్ కోర్సుల్లో 10 నెలలు అప్రెంటిస్‌షిప్ విధానం. కనీసం 20 క్రెడిట్లు సాధిస్తే బీటెక్ ఆనర్స్ డిగ్రీ. ఉదాహరణకు బీటెక్ మెకానికల్ చేస్తూ కంప్యూటర్ సైన్సులో కొన్ని అంశాలను అధ్యయనం చేయడం ద్వారా 20 క్రెడిట్లు సాధిస్తే ఆ విద్యార్థికి బీటెక్ ఆనర్స్ ఇవ్వాలని సూచన. ♦ప్రకాశంలో ఉపాధ్యాయ విద్య కోర్సుకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక వర్సిటీ, విజయనగరంలో మరో కొత్త వర్సిటీని ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశం. టీచర్ ట్రైనింగ్ వర్సిటీకి జిల్లాల్లోని టీచర్ ట్రైనింగ్ సంస్థలు అనుబంధంగా ఉంటాయి. ♦సెప్టెంబర్ 3వ వారం నుంచి ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ. -
అదిగదిగో బంగరు లేడి
తన ఆశ్రమంలో ధ్యానంలో లీనమై ఉన్న మారీచుడి ముందు వచ్చి నిలిచాడు రావణుడు. తమ రాజుని చూసిన మారీచుడు అతిథి సత్కారాలు చేశాడు. కుశలప్రశ్నలు వేశాడు. అంతటి మహా బలశాలి, పరాక్రమవంతుడు అయిన రావణుడు తన వద్దకు ఎందుకు వచ్చాడో తెలియలేదు. అదే విషయం వినయంగా అడిగాడు. సమాధానంగా రావణుడు ‘‘నాయనా! నేనిప్పుడు మహా కోపంతో ఉన్నాను. వాడెవడో రాముడట. దశరథ మహారాజు కొడుకట. తండ్రి అడవులకు వెళ్లమని ఆజ్ఞాపిస్తే, ఇక్కడకు వచ్చాడు. అతనొక్కడే నా బలగంలోని పద్నాలుగువేల మంది రాక్షసుల్ని, మా సైన్యాధ్యక్షుడైన త్రిశిరుణ్ణి, నా తమ్ముళ్లు ఖరదూషణాదుల్నీ చంపేసి, నన్ను దెబ్బతీశాడు. అతని అందచందాలకు ముగ్ధురాలై, చెంత చేరబోయిన నా చెల్లెలు శూర్పణఖ ముక్కూచెవులూ కోసి, కురూపిని చేసి, తీవ్రంగా పరాభవించాడు. నా చెల్లెలు దీనంగా నా వద్దకొచ్చి నిలుచుంటే, నా గుండె ద్రవించిపోయింది. ఆ రాముడి భార్య సీత మహా సౌందర్యవతి అట. ఆమె అంటే రాముడికి వల్లమాలిన ప్రేమట. ఆ సీతను అపహరించుకునిపోయి, రాముణ్ణి మానసికంగా దెబ్బతీయాలి. అప్పుడు కానీ, నా గుండె మంట చల్లారదు. నువ్వు నాకు మిత్రుడివి, మాయలు తెలిసిన వాడివి కాబట్టి సీతాపహరణకు నాకు సాయం చేయాలి’’ అన్నాడు. మారీచుడు రావణుడితో ‘‘మహారాజా! నీకు రాముడి సంగతి తెలియదు. అతడు మహా బలపరాక్రమ వంతుడు. ధర్మస్వరూపుడు. సీత ఆయన ప్రాణసఖి. ఆమెను ఆయన నుంచి వేరు చేసిన వారెవరయినా సరే, బతికి బట్టకట్టడం అసాధ్యం. ఇప్పటివరకు ఎంతో సుఖంగా, సంతోషంగా ఉన్నావు. కోరికోరి వైరం పెట్టుకుని, ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకు?’’ అని హితవు చెప్పబోయాడు. ఆ మాటలను రావణుడు ఏమాత్రం చెవిన వేసుకోకపోగా, నీవన్నీ సోమరిపోతు మాటలు. పనికిమాలిన ప్రబోధాలు. రాజు వచ్చి అడిగితే బంటు కాదని అనడం ఎక్కడైనా ఉందా? దిక్పాలకులే నా మాట మీరరే, నీవెంత? నీ సాయమడిగానని మిడిసిపడుతున్నావా? మర్యాదగా నీకు చెప్పిన పని చేయి. లేదంటే నిన్ను ఇక్కడికిక్కడే హతమారుస్తాను’’అని బెదిరించాడు. దుష్టుడైన రావణుడి చేతిలో చచ్చేకంటే, పురుషోత్తముడైన రాముడి చేతిలో మరణించడం మేలనుకున్నాడు మారీచుడు. వెంటనే వెండిచుక్కలున్న బంగారులేడిలా మారిపోయి, పంచవటి వైపు పయనించాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, శత్రువైనా సరే, అతడిలోని మంచిగుణాలను మెచ్చుకోవలసిందే! అదేవిధంగా, పోగాలం దాపురించిన వాడికి ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా, తలకెక్కవు అని. – డి.వి.ఆర్. భాస్కర్ -
జీవితం అభద్రత!
హోంగార్డుల వెట్టి సక్రమంగా అందని వేతనాలు కేటాయింపులకు మించి ఉద్యోగులు ప్రతి నెలా జీతంలో తప్పని కోతలు త్రిశంకు స్వర్గంలో 75 మంది హోంగార్డులు అధికారులకు పట్టని సంక్షేమం జిల్లాలో మొత్తం హోంగార్డులు : 800 కేటాయిస్తున్న బడ్జెట్ : 725 మందికే జీతాలు అందని వారి సంఖ్య : 75 ఒక్కొక్కరి జీతాల్లో కోత : రూ.800 ప్రతి నెలా నష్టపోతున్న మొత్తం : 5.80 లక్షలు నగరానికి చెంది ఓ హోంగార్డు పదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి ఆయన జీవితం ఎదుగూబొదుగూ లేకుండాపోయింది. నెలకు రూ.12వేల జీతంతో జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. కొద్ది రోజులుగా అందులోనూ కోత విధిస్తుండటంతో ఇతని వేదన వర్ణనాతీతం. మరో హోంగార్డు విధుల్లో చేరిన తర్వాత దేవుని సేవలో తరిద్దామనే ఉద్దేశంతో దేవాదాయ శాఖకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఓ ప్రముఖ దేవస్థానంలో కొన్నేళ్ల పాటు సేవలందించారు. ఆ తర్వాత ఆయనను సొంత శాఖకు సరెండర్ చేశారు. ప్రస్తుతం ఆయన ఉద్యోగం గాలిలో దీపంగా మారింది. ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికేడాది ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగని అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందనుకుంటే పొరపాటు. హోంగార్డు ఉద్యోగం ఇందుకు భిన్నం. పేరుకు పోలీసు శాఖలో పని చేస్తున్నామని చెప్పుకోవాల్సిందే కానీ.. పూట గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీరి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులూ వివక్ష చూపడం విమర్శలకు తావిస్తోంది. అనంతపురం సెంట్రల్: హోంగార్డుల జీవనం దుర్భరంగా మారింది. అసలే అరకొర జీతం.. అది కూడా నెల నెలా అందని పరిస్థితి. పోలీసులతో సమానంగా సేవలు అందిస్తున్నా.. ఇప్పటికీ అప్పు చేయనిదే కుటుంబం గడవని దీనావస్థ. జిల్లాలో 800 పైచిలుకు హోంగార్డులు పని చేస్తున్నారు. వీరిలో 725 మంది పోలీసు శాఖలో ఉన్నారు. మిగిలిన వారు రోడ్డు రవాణా శాఖ, సివిల్ సప్లయ్, బీఎస్ఎన్ఎల్, సబ్‌జైలు తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా పని చేస్తున్నా ఇప్పటికీ వీరి జీతం రూ.12వేలే. ఈ మొత్తం కూడా ఎప్పుడు వస్తుందో.. ఎంత కోత పడుతుందోననే బెంగ ఉంటోంది. ప్రతి నెలా 5లోగా జీతాలు చెల్లించాలని గత ప్రభుత్వాలు జీఓలు విడుదల చేసినా.. అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. గాలిలో దీపంలా బతుకులు పోలీసుశాఖ ద్వారా రిక్రూట్ అయి ఇతర ప్రభుత్వశాఖలకు డెప్యూటేషన్లపై వెళ్లిన హోంగార్డుల పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది. పోలీసుశాఖకు ప్రతి నెలా 725 మంది హోంగార్డులకు సంబంధించిన జీతాలకు మాత్రమే బడ్జెట్ విడుదలవుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సరైండరైన ఉద్యోగులకు జీతాలు రావట్లేదు. ఇలాంటి వారి సంఖ్య దాదాపు 40 మందికి పైగా ఉన్నారు. మరికొందరు ఆయా శాఖల్లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది. పోలీసు అధికారులు వారికి పోస్టింగ్‌లు చూపించడం లేదు. దీంతో ఒక నెల కొంతమందికి, మరో నెల ఇంకొందరికి విధులకు పంపేవారు. ఖాళీగా ఉన్న సమయంలో వారికి జీతాలు అందే పరిస్థితి లేదు. ఈ నెల నుంచి బడ్జెట్ వస్తున్న 725 మంది నుంచి కొంత మంది కట్ చేసుకొని వీరికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల ఒక్కో హోంగార్డు నుంచి రూ. 800 వరకు వసూలు చేశారు. ‘‘చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నాం. ఇందులోనూ కోతలు పెడితే ఎలా’’ అంటూ చాలామంది హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుశాఖలో ఎవరికీ తలెత్తని బడ్జెట్ సమస్య హోంగార్డులకే ఎందుకు వస్తోందని వాపోతున్నారు. పోలీసుశాఖలో హోంగార్డులు అంతర్భాగమని, వారు లేని శాఖను ఊహించుకోలేమని కొందరు అధికారులు ఉపన్యాసాల్లో చెబుతుంటారు. అలాంటి హోంగార్డుల సంక్షేమాన్ని మాత్రం అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పిల్లలకు స్కాలర్షిప్లు, వైద్య చికిత్సలు, కల్యాణ మంటపాల్లో రాయితీలు ఏవీ హోంగార్డులకు లేకపోవడం శోచనీయం. కానీ విధులు మాత్రం పోలీసులతో సమానంగా చేయిస్తుండడం గమనార్హం. 725 మందికే బడ్జెట్ జిల్లాలో కేటాయించిన పోస్టుల కన్నా ఎక్కువ మంది హోంగార్డులు ఉన్నారు. 725 మందికి మాత్రమే జీతాలకు సంబందించి బడ్జెట్ రిలీజ్ అవుతోంది. ఇందులో కొంతమందికి జీతాలు రావట్లేదు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నెలలో రెండు రోజులు మిగిలిన వారికి సెలవులు ఇస్తున్నాం. వారి జీతంలో ఆ మొత్తం కట్ చేసి జీతాలు రాని వారికి అందిస్తున్నాం. మరో 200 హోంగార్డు పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశాం. అనుమతి వస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. - చిన్నికృష్ణ, డీఎస్పీ, ఏఆర్ -
సన్మానాలు, వినోదాలకు ఖర్చు పెట్టొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా నిధుల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. కేంద్రం నుంచి అందే నిధులను సన్మానాలు, వినోద కార్యక్రమాల ఏర్పాటు, వాహనాల కొనుగోళ్లు వంటి వాటికి వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధుల వినియోగానికి మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే గ్రామ పంచాయతీలు నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు అందే కేంద్ర నిధుల్లో కార్యాలయ నిర్వహణ కోసం ఇచ్చే పది శాతం సొమ్ముతో... సన్మానాలు, వినోద కార్యక్రమాలు, ఏసీలు, వాహనాల కొనుగోళ్లు చేపట్టరాదని స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలకు వెచ్చించొచ్చు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీల కు కేటాయించే నిధుల వినియోగంపై మార్గదర్శకాలను రూ పొందించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం... కార్యాలయ నిర్వహణ కోసం వెసులుబాటు కల్పించిన పదిశాతం నిధులను వినియోగిస్తూ గ్రామ పంచాయతీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరాదు. అలంకరణ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, పారితోషికం చెల్లింపు, అవార్డులు అందించడం, ప్రజా ప్రతినిధులకు టీఏ, డీఏ చెల్లించడం వంటి చేయకూడదు. వేరే పథకాల కింద అమలవుతున్న కార్యక్రమాలకు ఈ పదిశాతం సొమ్మును వినియోగించరాదు. అయితే గ్రామ పంచాయతీ కార్యాలయానికి అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్ల కొనుగోలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ నిధులను వినియోగించవచ్చు. గ్రామ పంచాయతీ విద్యుదీకరణ, కొనసాగుతున్న సివిల్ పనులను పరిశీలించడానికి వచ్చిన నిపుణులకు పారితోషికం చెల్లింపునకు వాడవచ్చు. ఇక గ్రామ పంచాయతీలకు ప్రస్తుతమున్న సిబ్బంది, మౌలిక వసతుల ఆధారంగా ప్రాధాన్యతలతో కూడిన జాబితాను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. -
ఓరుగల్లులో ‘నేదునూరి’ కీర్తనలు
హన్మకొండ కల్చరల్ : తన గానంతో సంగీత ప్రియుల ను మైమరిపించి ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నాదబ్రహ్మ, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తికి జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉంది. శాస్త్రీయ సం గీతంలో ప్రతిభాశాలిగా పేరొందిన సంగీత విద్వాం సుడు కృష్ణమూర్తి మరణంతో జిల్లాకు చెందిన సంగీత ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరంగల్ గడ్డపై నేదునూరి అందించిన కచేరీలు ఇక్కడి ప్రజలను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి ఓరుగల్లులో చేసిన కచేరీలను ఒకసారి జ్థాపకం చేసుకుందాం. జిల్లాకు చెందిన ప్రముఖ నృత్య సంగీత సంస్థ జనప్రియ గానసభ ప్రారంభ వేదికపై తన 53వ యేట నేదునూరి సంగీత కచేరీ నిర్వహించారు. వరంగల్‌లోని కేఎంసీ ఆడిటోరియంలో 1981 మార్చి 1న జరిగిన జనప్రియ గానసభను అప్పటి విదేశాంగ వ్యవహారాలశాఖ మంత్రి పీవీ నర్సింహారావు ప్రారంభిం చారు. కాగా, అప్పటి రాష్ట్ర మంత్రి టి.హయగ్రీవాచారి, పీవీ నర్సింహారావు సమక్షంలో నేదునూరి కృష్ణమూర్తి సంగీత కచేరి చేయడంతోపాటు వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించి సంగీత ప్రియులను, పండితుల ను ఓలలాడించారు. ఆ సమయంలో ప్రముఖ సంగీత వేత్తలు పేరి శ్రీరామ్మూర్తి వయోలిన్ సహకారం అందించగా.. దండమూడి రామ్మోహన్ మృదంగం వాయించారు. రెండో సారి.. 1984 మార్చిలో జనప్రియ గానసభ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారిగా ‘త్యాగరాయ ఆరాధనోత్సవా లు’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత వీణా విద్వాంసులు చిట్టిబాబు కచేరి జరి గింది. అయితే నేదునూరి కృష్ణమూర్తి ఆ సమయంలో కచేరి చేయలేదు కానీ.. చిట్టిబాబు స్వయంగా మేనల్లుడు కావడంతో తాను కూడా కచేరీలో పాల్గొని ఓరుగల్లు సం గీత ప్రియులతో సమావేశమయ్యారు. కాగా, 1988లో జనప్రియ గానసభ ఆధ్వర్యంలో రెండోసారి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేదునూరి కృష్ణమూర్తి సంగీత కచేరీ చేసి సంగీత ప్రియులను అలరించారు. పలువురి సంతాపం.. కృష్ణమూర్తి మరణవార్తను తెలుసుకున్న జిల్లాకు చెంది న సంగీత ప్రియులు, ఆయన అభిమానులు దిగ్భాం తికి లోనయ్యారు. నేదునూరి మరణం యావత్ సంగీత ప్రపంచానికి తీరనిలోటని జనప్రియ గానసభ అధ్యక్ష, కార్యదర్శులు పర్చా కోదండరామారావు,వీఎల్. నర్సిం హారావు పేర్కొన్నారు. తన ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని సంతకం చేసి రిజిస్టర్ పోస్టు చేసి పంపించారని వీఎల్ నర్సింహారావు గుర్తు చేసుకున్నారు. ప్రముఖ కర్ణాటక సంగీత విదుషిమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి కంటే ముందుగానే నేదునూరి కృష్ణమూర్తి అన్నమయ్య పాటలను స్వర పర్చారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నేదునూరి మృతికి మన సంస్కృతి సాహిత్య సాంస్కృతిక ప్రధాన కార్యదర్శి మిద్దెల రంగనాథ్, రమాదేవి, విద్యారణ్య సంగీత నృత్య కళాశాల ఉపన్యాసకులు రామకృష్ణశర్మ, జనస్వామి శ్రీనివాసమూర్తి, ఉల్లి జయకాంత్, జియావుద్దీన్, భద్రకాళి దేవాలయ ప్రధానార్చకుడు భద్రకాళిశేషు సంతాపం తెలిపారు.