‘భారతీయులు తక్షణమే ఖార్కివ్‌ను వీడండి.. లేదంటే’ | Russia Ukraine War: Indians Should Leave Kharkiv Indian Embassy Appeal | Sakshi
Sakshi News home page

Russia Ukraine War: ‘భారతీయులు తక్షణమే ఖార్కివ్‌ను వీడండి.. లేదంటే’

Published Wed, Mar 2 2022 6:29 PM | Last Updated on Wed, Mar 2 2022 8:20 PM

Russia Ukraine War: Indians Should Leave Kharkiv Indian Embassy Appeal - Sakshi

ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌పై రష్యా బాంబుల దాడిని తీవ్రతరం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారతీయులు ఖార్కివ్‌లో ఉండటం క్షేమం కాదని ఇండియన్‌ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ వరుస ట్వీట్లతో భారతీయులు వెంటనే ఖార్కివ్‌ వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

ఈ క్రమంలో భారతీయులను ఉక్రెయిన్‌లోని పెసోచిన్‌, బెజ్లిడోవ్కా,బబయే ప్రాంతాలకు వెంటనే వెళ్లాలన్న భారత ఎంబసీ.. ఉక్రెయిన్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు సమయంలోపు చేరుకోవాలని సూచించింది. ప్రస్తుతం పరిణామాల దృష్ట్యా ఆ ప్రాంతాలకు రైల్వే స్టేషన్‌లో వాహనాలు లేదా బస్సులు దొరకని విద్యార్థులు, పరిస్థితులు తీవ్రతరం అర్థం చేసుకుని కాలినడకనైనా చేరుకోవాలంటూ సూచించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement