Sonu Sood & Team Helping Indian Students In Ukraine Get Them Safe To Home - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు.. రంగంలోకి దిగిన సోనూ సూద్‌.. వీడియో వైరల్‌

Published Fri, Mar 4 2022 1:24 PM | Last Updated on Fri, Mar 4 2022 1:58 PM

Sonu Sood Helping Indian Students In Ukraine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు సోనూ సూద్‌ అంటే బహుశా తెలియని వారు ఉండకపోవచ్చు. కరోనా సమయంలో ఎందరో అభాగ్యులకు సోనూ నేనున్నా అంటూ ఆపన్న హస్తం అందించారు. ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా తన వంతు సాయం చేశారు. స్వస్థలాకు వెళ్లేవారి కోసం బస్సులు నడిపించారు. అన్ని తానై వేల మందికి సాయం అందజేశారు.

తాజాగా ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల సమయంలోను మరోసారి సోనూ సూద్‌ను బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. సాయం కోసం సోషల్‌ మీడియా వేదికగా సోనూకు వినతులు పంపుతున్నారు. అయితే, ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ పట్టణంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను అక్కడి నుంచి తరలించడానికి సోనూసూద్‌కు చెందిన చారిటీ సంస్థ సేవలు అందిస్తోంది. భారతీయులను ఖర్కీవ్‌ నుంచి పోలాండ్‌ సరిహద్దు వరకు తరలించేందుకు చారిటీకి చెందిన సభ్యులు సాయం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. సోనూ సూద్‌కు తమకు సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. తాము ఇక్కడి నుండి స‍్వదేశానికి చేరుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ వీడియోపై సోనూ ట‍్విట్టర్‌ వేదికంగా స్పందించాడు. ఇది నా బాధ్యత.. నా వంతుగా సాయం అందించినందుకు సంతోషంగా ఉందంటూ కామెంట్స్‌ చేశాడు. దీంతో మరోసారి సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పోస్టు వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement