మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరగుతున్న యుద్ధంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. వారు రష్యా ఆర్మీ సైనికులుగా సేవలు అందిస్తున్న క్రమంలో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశి వ్యవహారాల శాఖ వెల్లడించింది. మృతి చెందిన వారి బాడీలను ఇండియాకు పంపించాలని రష్యాను భారత విదేశాంగశాఖ కోరింది. మృతి చెందినవారి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
‘‘ భారత్‌లోని రష్యన్ అంబాసిడర్ ద్వారా మాస్కోలోని ఇండియన్ ఎంబసి ఈ విషయంపై చర్యలు చేపట్టింది. అదే విధంగా రష్యన్ ఆర్మీలో ఉన్న భారతీయులను విడుదల చేసి ఇండియాకు తిరిగి పంపించాలని కోరాం. భవిష్యత్తులో రష్యన్ ఆర్మీలో భారతీయులను చేర్చుకోవటం నిలిపివేయాలని డిమాండ్ చేశాం’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
రష్యాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. ‘‘ రష్యా ఆర్మీలో సహాయకులుగా పనిచేసే ఉద్యోగాలకు భారతీయులు వెళ్లవద్దు. ఇటువంటి నియామకాలు నకిలీవి, చాలా ప్రమాదకరమైవి’’ అని ఆయన తెలిపారు.
మార్చిలో భారత విదేశాంగ శాఖ.. రష్యాలో వెళ్లే భారతీయులను హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యా మిలిటరీలో ప్రమాదకరంగా ఉండే ఉద్యోగాలు చేరటం మానుకోవాలని తెలిపింది. ఇటువంటి నియామకాల్లో చాలా జగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment