
ఆప్ఘనిస్తాన్‌లో గల భారతీయ ఎంబసీ
కాబుల్ : ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో గల భారతీయ ఎంబసీపై క్షిపణి పడింది. ఈ ఘటనలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎంబసీలోని ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ఐటీబీపీ భద్రతా బలగాలు ఉండే మూడు బరాక్‌లకు చేరువలో రాకెట్ పడినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. అయితే, భారతీయ ఎంబసీ టార్గెట్‌గానే రాకెట్ ప్రయోగం జరిగిందా? అన్న విషయంపై స్పష్టత ఇంకా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment