
అర్జెంటీనాలో మస్తాన్‌బాబుకు ఘననివాళి
సంగం: పర్వాతారోహకుడు మస్తాన్‌బాబు మృతదేహాన్ని అర్జెంటీనా నుంచి ఆయన స్వగ్రామానికి తరలిస్తుండడంతో అక్కడి భారత ఎంబసీ అధికారులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మస్తాన్‌బాబు సోదరి దొరసానమ్మ ఫేస్‌బుక్‌లో వివరాలను పొందుపరిచారు. మువ్వన్నెల జెండా పక్కన మస్తాన్‌బాబు ఫొటోలను పుష్పగుచ్ఛాల మధ్య ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మస్తాన్‌బాబు సాహసాలను వారు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో దొరసానమ్మతో పాటు అర్జెంటైనాలోని భారతీయ ప్రతినిధుల బృందం పాల్గొంది.