
ఇరాక్‌లో ఇరుక్కున్న వారు ఇంటికి..
⇒ బాధితులను పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి
⇒ నెలాఖరు లోగా పంపించేందుకు ఎంబసీ హామీ
జన్నారం(ఖానాపూర్): ఇరాక్‌లో చిక్కు కున్న బాధితులను స్వగ్రామాలకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరాక్‌లోని భారత రాయ బార కార్యాలయ అధికారులపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నెలాఖరు లోగా వారిని తిరిగి పంపించేం దుకు అక్కడి రాయబార కార్యాలయ అధికారి దీపక్ విజ్ఞాని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి బసంతరెడ్డి, తపాలపూర్‌వాసి మాటేటి కొమురయ్య ఆదివారం ‘సాక్షి’కి వివరించారు. ‘ఇరాక్‌లో ఇరుక్కున్నాం.. ఆదుకోండి’ శీర్షికన ఈ నెల 10న ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది.
మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా లకు చెందిన సుమారు 300 మంది విజిట్ వీసాపై వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతున్న విష యాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసు కొచ్చింది. ఈ కథనానికి స్పందిం చిన ఢిల్లీ భారత రాయబార కార్యాలయ ఎన్నారై విభాగం అధికారి చిట్టిబాటు... బసంతరెడ్డితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఆయనకు ఫోన్ చేసి వివరాలు సేకరించారు.
ఇరాక్‌లోని ఎర్బిల్ భారత రాయబార సంస్థలో రాజు అనే అధికారిని డిప్యూటీ కౌన్సిలర్‌గా నియమించి, ఈ సమస్య పరిష్కరించాలని ఢిల్లీ కార్యాలయం నుంచి ఆదేశించారు. ఈ క్రమంలో బాధితులను ఈ నెలాఖరు వరకు తిరిగి పంపిస్తామని దీపక్ విజ్ఞాని హామీ ఇచ్చి నట్లు తెలిపారు. ‘సాక్షి’ కథనంతోనే స్పం దించారని, తాము ‘సాక్షి’ పేపర్‌ను మరువబోమని బాధితులు పేర్కొన్నట్లు కొమురయ్య ఫోన్ ద్వారా తెలిపారు.