అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బాంబు పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడులో భారతీయ ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదు. కానీ ఈ పేలుడులో పెద్ద ఎత్తున 65 మంది ప్రాణాలు విడిచినట్టు అఫ్ఘాన్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 325మంది గాయపడ్డారని తెలిపింది. భారత రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలోనే సంభవించిన ఈ పేలుడు ఈ ప్రాంతమంతా నెత్తుటి చారికలతో, క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహంగా మారింది.