వాషింగ్టన్: అమెరికాలోని భారతీయులకు కొందరు సైబర్ నేరగాళ్లు రాయబార కార్యాలయం (ఎంబసీ) ఫోన్ నంబర్ల నుంచే కాల్స్ చేసి డబ్బులు కాజేస్తున్న సంఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పాస్‌పోర్టులు, వీసాల్లో తప్పులు ఉన్నాయనీ, వాటిని సరిదిద్దుకోకపోతే అమెరికా నుంచి పంపించి వేయడం లేదా అక్కడే జైలులో పెడతారంటూ నేరగాళ్లు అక్కడి భారతీయ అమెరికన్‌లకు ఫోన్లు చేస్తున్నారు.
తమ ఖాతాలోకి డబ్బులు జమచేస్తే లేదా క్రెడిట్/డెబిట్ కార్డుల వివరాలు, ఓటీపీ చెబితే ఆ తప్పులను తామే సరిదిద్దుతామని వారు నమ్మబలుకుతున్నారు. సాంకేతికతను వాడి రాయబార కార్యాలయం ఫోన్‌ల నుంచే కాల్స్ వస్తున్నట్లు మాయ చేసి నమ్మిస్తున్నారు. ఈ తరహా మోసాలు రాయబార కార్యాలయం దృష్టికి రావడంతో అలాంటి వాటిని నమ్మవద్దని అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. అమెరికా ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment