ఖట్మాండులోని భారత రాయబార కార్యాలయం వద్ద నేపాల్ పోలీసు బలగాలు (ఇన్‌సెట్‌లో ఎంబసీ బిల్డింగ్)
ఖట్మాండు: నేపాల్ రాజధాని ఖట్మాండులో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. బిరత్‌నగర్ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుళ్లు జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదని అధికారులు . పేలుడు తీవ్రత స్వల్పమే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
మంగళవారం ఉదయం సుమారు 8:20 గంటలకు ఘటన జరిగిందని, పేలుడు ధాటికి కార్యాలయం ప్రహారీ గోడ ధ్వంసమైందని, అయితే ఆ సమయంలో ఆఫీసులో ఎవరూ లేరని నేపాల్ పోలీసులు చెప్పారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పేలుడుకు గల కారణాలను కనిపెడతామని చెప్పారు. ప్రస్తుతం భారతీయ రాయబార కార్యాలయంలో సాధారణ స్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment