భారత ఎంబసీ వద్ద బాంబు పేలుడు | The bomb blast at the Indian Embassy | Sakshi
Sakshi News home page

భారత ఎంబసీ వద్ద బాంబు పేలుడు

Published Wed, Jan 6 2016 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

The bomb blast at the Indian Embassy

జలాలాబాద్: అప్గానిస్తాన్‌లో భారతీయ సంస్థలపై ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జలాలాబాద్ నగరంలో ఉన్న భారత దౌత్య కార్యాలయం సమీపంలో మంగళవారం బాంబు పేలింది. కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్లు భారత దౌత్యాధికారి ఒకరు తెలిపారు. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని అప్గాన్ అధికారులు తెలిపారు. భారత కాన్సులేట్ సమీపంలోనే పాక్, ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఉన్నాయని విదేశాంగ ప్రతినిధి వికాశ్ స్వరూప్ అన్నారు. దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ఇంతవరకు ప్రకటన చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement