వాషింగ్టన్: గతనెల చికాగో వీధుల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించిన హైదరాబాదీ యువతికి వైద్య సదుపాయాన్ని కల్పించడం తోపాటు ఆమెను తిరిగి భారత దేశానికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేసింది చికాగోలోని భారత ఎంబసీ. ఈ విషయాన్ని బాధితురాలి తల్లికి తెలియజేశామని ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది.
హైదరాబాద్‌కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ డెట్రాయిట్‌లోని ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికా వెళ్లింది. కానీ అక్కడ ఆమె వస్తువులను దుండగులు దొంగిలించడంతో దిక్కుతోచని స్థితిలో చికాగో వీధుల్లో తిరుగాడుతూ కనిపించింది. అత్యంత దీనావస్థలో తినడానికి తిండిలేక దయనీయ స్థితిలో ఉండిపోయిన ఆమెను గురించి తెలంగాణలోని మజ్లీస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అజ్మద్ ఉల్లా ఖాన్ బాధితురాలి తల్లి రాతపూర్వకంగా చేసిన విజ్ఞప్తిని ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు.
అజ్మద్ ఉల్లా ఖాన్ ట్వీట్‌కు స్పందిస్తూ కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ వెంటనే విషయాన్ని చికాగోలోని భారత ఎంబసీ దృష్టికి తీసుకుని వెళ్ళగా అక్కడివారు ఆమెను కనుగొని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రయాణించే పరిస్థితుల్లో లేదని ముందు తనకు వైద్యం అవసరమని తెలిపిన యూఎస్ ఎంబసీ ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలిపింది. దీంతో సైదాను తిరిగి భారత్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ అనే తల్లికి సమాచారమందించారు ఎంబసీ అధికారులు.
ఇది కూడా చదవండి: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు..
Comments
Please login to add a commentAdd a comment