US Indians
-
అమెరికాలో అయ్యో పాపం మన పిల్లలు...
న్యూఢిల్లీ: అమెరికాలో ఉంటున్న భారతీయులకు మరో చేదు వార్త. వారి పిల్లల్లో చాలామంది 21 ఏళ్లు నిడగానే దేశం వీడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరి హెచ్4 కేటగిరీ వీసాల ప్రాసెసింగ్‌కు దశాబ్దాలకు పైగా వెయిటింగ్ జాబితా ఉండటమే ఇందుకు కారణం. వీరి సంఖ్య లక్షకు పైగా ఉంటుందన్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డుల కోసం ఉద్యోగాధారిత కేటగిరీ కింద దరఖాస్తు చేసుకుని వెయిటింగ్ లో ఉన్న భారతీయుల సంఖ్య 10.7 లక్షలకు పైగా ఉంది. ఇది చాలదన్నట్టు ఒక్కో దేశం నుంచి ఏటా ప్రాసెస్ చేసే వీసా దరఖాస్తుల సంఖ్యను 7 శాతానికి పరిమితం చేయడం సమస్యను జటిలం చేసింది. ప్రస్తుత వేగంతో మన వాళ్లందరికీ గ్రీన్ కార్డులు రావాలంటే హీన పక్షం 135 ఏళ్లు పడుతుంది. 21 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించేదే హెచ్4 వీసా. ఈ కారణంగా కనీసం 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుందని డిసైడ్ మెయిర్ అనే ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణుడు చేసిన అధ్యయనంలో తేలింది. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. 21 ఏళ్లు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత వాళ్లు హెచ్4 కేటగిరీ కింద అక్కడ ఉండేందుకు వీల్లేదు. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్ (ఎఫ్) వీసా సంపాదించాలి. అవి చాల పరిమిత సంఖ్యలో మాత్రమే దొరుకుతాయి. దొరకని వారంతా అమెరికా వీడాల్సి ఉంటుంది. పిల్లలుగా అమెరికా వెళ్లి, అక్కడే పెరిగి పెద్దయిన వారికి ఇలా తల్లిదండ్రులను వదిలి దేశం వీడటం నరకప్రాయమే. పైగా భారత్ లోని తమ కుటుంబాలతో వారికి పెద్ద బంధాలేవీ ఉండే అవకాశం పెద్దగా ఉండదు. కనుక వెనక్కు వచ్చి ఇక్కడ, ఎలా ఉండాలన్నది మరో పెద్ద సమస్య కాగలదు. -
చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం
వాషింగ్టన్: గతనెల చికాగో వీధుల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించిన హైదరాబాదీ యువతికి వైద్య సదుపాయాన్ని కల్పించడం తోపాటు ఆమెను తిరిగి భారత దేశానికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేసింది చికాగోలోని భారత ఎంబసీ. ఈ విషయాన్ని బాధితురాలి తల్లికి తెలియజేశామని ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ డెట్రాయిట్‌లోని ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికా వెళ్లింది. కానీ అక్కడ ఆమె వస్తువులను దుండగులు దొంగిలించడంతో దిక్కుతోచని స్థితిలో చికాగో వీధుల్లో తిరుగాడుతూ కనిపించింది. అత్యంత దీనావస్థలో తినడానికి తిండిలేక దయనీయ స్థితిలో ఉండిపోయిన ఆమెను గురించి తెలంగాణలోని మజ్లీస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అజ్మద్ ఉల్లా ఖాన్ బాధితురాలి తల్లి రాతపూర్వకంగా చేసిన విజ్ఞప్తిని ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. అజ్మద్ ఉల్లా ఖాన్ ట్వీట్‌కు స్పందిస్తూ కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ వెంటనే విషయాన్ని చికాగోలోని భారత ఎంబసీ దృష్టికి తీసుకుని వెళ్ళగా అక్కడివారు ఆమెను కనుగొని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రయాణించే పరిస్థితుల్లో లేదని ముందు తనకు వైద్యం అవసరమని తెలిపిన యూఎస్ ఎంబసీ ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలిపింది. దీంతో సైదాను తిరిగి భారత్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ అనే తల్లికి సమాచారమందించారు ఎంబసీ అధికారులు. ఇది కూడా చదవండి: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
భారత్-అమెరికా రక్షణ ఒప్పందాలపై సదస్సు
-
మోదీని కాపీ కొట్టిన ట్రంప్.. దీపావళి విషెస్ కూడా..
న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ అనగానే పరిచయం అవసరం లేకుండానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే వ్యక్తి. ఆయన ఒక్కో మాట ఒక సంచలనం. ఆయన ఇప్పటి వరకు మెక్సికన్లను అవమానించి ఉండొచ్చు.. ముస్లింలను తిట్టిపోసి ఉండొచ్చు. కానీ, అనూహ్యంగా భారతీయ అమెరికన్లను మాత్రం ట్రంప్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ 2014లో ప్రచార అస్త్రంగా ఉపయోగించిన వాక్యాన్ని కాపీ కొట్టి తన పేరిట ప్రచార వాక్యంగా ఉపయోగించారు. అది కూడా అచ్చం మోదీలాగే హిందీలో ఆ వాక్యాన్ని చెబుతూ అబ్బురపరిచారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ దీపావళి పండుగను పురస్కరించుకొని భారతీయ అమెరికన్లకు శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రకటన చేశారు. అందులో చక్కగా హిందీ భాషలో మాట్లాడారు. 'ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్'(ఈసారి ట్రంప్ ప్రభుత్వం) అంటూ వ్యాఖ్యానించాడు. ప్రధాని మోదీ గతంలో 2014లో 'ఆప్ కీ బార్ మోదీ సర్కార్' అంటూ ప్రచారంలో వాడిన విషయం తెలిసిందే. అంతేకాదు, న్యూజెర్సీలో ఏర్పాటుచేసిన సమావేశానికి వచ్చిన హిందు భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఉన్న ఫుటేజీని ఈ ప్రకటనకు జతచేసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలు చాలా బలంగా ఉంటాయని తాను హామీ ఇస్తున్నట్లు అందులో తెలిపారు. 'భారతీయ హిందూ వర్గం అమెరికన్ వైట్ హౌస్ కు చాలా దగ్గరి మిత్రులు. మేం హిందువులను ప్రేమిస్తాం. మేం భారత్‌ను ప్రేమిస్తాం. మోదీతో కలిసి పనిచేసే యోచన చేస్తున్నాను' అంటూ ఆయన ఆ ప్రకటన వీడియోలో మాట్లాడారు. గతవారం ఆయన కూతురు లారా ట్రంప్ వర్జీనియాలోని హిందూ ఆలయాన్ని సందర్శించి పూజలు కూడా నిర్వహించారట.