hyderabad woman
-
‘బస్తీ’... దొరసాని
చెత్తను సేకరించే అమ్మాయి అధికారిణి అయితే... కలలను నిజం చేసుకోవడానికి స్థాయి అక్కర్లేదు అని చూపుతోంది హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పిల్లిగుడిసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ హోదాలో ఇటీవల ఒక రోజు బాధ్యతలు నిర్వహించి, వివిధ శాఖలను సందర్శించి, అక్కడి పనితీరును అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా అందుకున్న గౌరవాన్నే కాదు, తెలుసుకున్న విశేషాల గురించీ పంచుకుంది.‘‘మూడు సంవత్సరాల నుంచి ఈ పోటీలో ఎంపిక కావడానికి ప్రయత్నిస్తున్నాను. 2021లో రన్నరప్ వచ్చింది. ఈ ఏడాది ఒక రోజు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌కి ఎంపికయ్యాను అని తెలిసి, చాలా ఆనందించాను.రోజంతా కార్యక్రమాలతో బిజీ...ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నేను సూట్ వేసుకొని అధికారిణిగా మా బస్తీ నుంచి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సర్‌తో కలిసి బయల్దేరాను. మొదటగా రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసును సందర్శించాం. అక్కడ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ నీరజ జొన్నలగడ్డ గారితో మాట్లాడాను. రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసు మొత్తం తిప్పి చూపించారు. అక్కడ జరిగే వర్క్ గురించి అంతా తెలుసుకున్నాను. అక్కణ్ణుంచి... మై ఛాయిస్ ఫౌండేషన్‌కు వెళ్లాం. గృహహింస, ట్రాఫికింగ్ పైన ఆ సంస్థ పనిచేస్తుంది. పది రాష్ట్రాల్లో వారు చేస్తున్న పని గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత వి–హబ్ కి వెళ్లాం. తెలంగాణ మహిళలు వ్యాపారులుగా ఎదిగేందుకు మద్దతునిస్తున్నారు. వాళ్లు ఏ విధంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకెళుతున్నారో చెప్పారు. నా గురించి, నా ఫ్యూచర్ ΄్లాన్స్ గురించి వాళ్లూ అడిగారు. ఉమెన్ స్టార్టప్స్ గురించి అడిగి తెలుసుకున్నాను. వారితో కలిసి లంచ్ చేశాం. మంచి ఇంటరాక్టివ్ సెషన్ మా మధ్య జరిగింది. అక్కణ్ణుంచి.. డజన్ ఫౌండేషన్‌కి వెళ్లి, మహిళా ఉద్యోగులతో చర్చలు జరిపాం. టెక్ రంగంలో మహిళల నైట్ షిప్ట్‌లు, పేమెంట్ విషయంలో జెండర్ బయాస్డ్ సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాను. ఆ తర్వాత సీనియర్ సిటిజెన్స్ కోసం పనిచేసే ఫాతిమా ఫౌండేషన్‌ను సందర్శించాం.చెత్త సేకరణ మా వృత్తిమా అమ్మానాన్నలతో పాటు కలిసి మేం హైదరాబాద్‌లో 400 ఇళ్లలో చెత్త సేకరిస్తుంటాం. ఉదయం 5 గంటలకు మా పని మొదలవుతుంది. 7–8 గంటల వరకు పని ముగించుకొని, కాలేజీకి వెళతాను. స్కూల్ రోజుల నుంచి అమ్మానాన్నలతో పాటు నేను, మా చెల్లెలు, అన్నయ్య కూడా ఇదే పనిలో ఉంటున్నాం. 8వ తరగతిలో ఉన్నప్పుడు మౌంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ చిల్డ్రన్ పార్లమెంట్ అనేప్రోగ్రామ్ పెట్టింది. పది బస్తీల నుంచి పిల్లలను తీసుకొని ఈప్రోగ్రామ్ చేసేది. నేను అందులో పాల్గొన్నాను. 9వ తరగతిలో హైదరాబాద్ చిల్డ్రన్ పార్లమెంట్‌కు పీఎమ్‌గా ఉన్నాను. మా బస్తీ పిల్లలందరం సమస్యల మీద మాట్లాడుకుని అధికారులను కలిసేవాళ్లం. టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు సాయంకాలాలు మా బస్తీలో ఉన్న ముప్పై మంది పిల్లలకు పాఠాలు చెబుతుండేదాన్ని. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్‌గా పనిచేశాను.ఆకలి విలువ.. నిద్ర విలువమా కమ్యూనిటీలో పిల్లలు ఉదయం టిఫిన్ చేయకుండానే స్కూళ్లకు వెళ్లిపోతుంటారు. మా చిన్నప్పటి నుంచి ఆకలి విలువ, నిద్ర విలువ మాకు తెలుసు. అందుకే, అధికారులను కలిసి విషయం చెబితే బస్తీల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఐఏఎస్ దివ్యా దేవరాజన్ మేడమ్ నాకు ఎన్నో విషయాల్లో అడ్వైజ్ చేస్తుంటారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గురించి అలాగే నాకు తెలిసింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు డిప్యూటీ హై కమిషన్ 2017 నుంచి ఏటా పోటీలు నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పోటీల్లో ఈ ఏడాది నేను విజేతగా నిలిచాను. అంతకు ముందు ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకున్నాను. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో నేనొకరిని. ఇందులో భాగంగా జూన్ 2023లో అమెరికా వెళ్లి వచ్చాను. ఈ ఏడాది మహిళా శక్తి పురస్కారం కూడా అందుకున్నాను. నేను పుట్టి పెరిగింది గార్బేజ్ కమ్యూనిటీలో. అలాంటిది ఉదయం నుంచి డిస్కవర్ వెహికల్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ ఓవెన్ సర్‌తో కలిసి ప్రయాణించడం సాధారణ విషయం కాదనిపించింది. యుపీఎస్సీ సాధించి, ఆఫీసర్ హోదాను పొందితే ఇంకా ఎన్నో మంచి పనులు చేయచ్చు. దానికి ముందు పై అధికారులు ఎలా ఉంటారు.. ఎలా వర్క్ చేస్తారు అనేవి స్వయంగా కలిసి తెలుసుకున్నాను అనిపించింది. మా కమ్యూనిటీని అభివృద్ధి చేసేంతగా ఎదగాలన్నది నా లక్ష్యం’’ అని వివరించింది జయలక్ష్మి. నా పనిని నేను ప్రేమిస్తాను..చెత్త సేకరిస్తామని ‘ఆ వాసన ను ఎలా భరిస్తావు’ అని మా క్లాస్మేట్స్ కొందరు అడిగేవారు. చాలా వరకు జాలి చూపేవారు. కానీ నేను మా పనిని ప్రేమిస్తాను. అమ్మా నాన్నా మా చిన్నప్పటి నుంచి అదే చెప్పేవారు. నాకు మద్దతుగా నిలిచే ఫ్రెండ్స్ ఉన్నారు. లెక్చరర్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. అమ్మకి నా పట్టుదల, నేను చేస్తున్న పనులంటే చాలా ఇష్టం. అన్నయ్య డిగ్రీ పూర్తయ్యింది, చెల్లి డిగ్రీ చేస్తోంది. అమ్మానాన్నలను చూసుకునేలా, మా కమ్యూనిటీని బాగు చేసేలా ఉన్నత జీవితాల్లో స్థిరపడాలన్నదే మా కల. – అరిపిన జయలక్ష్మిమాటల్లో వర్ణించలేనుమా కమ్యూనిటీ, నేనుండే బస్తీ వాతావరణం వేరు. అలాంటిది, ఒక రోజంతా ఆఫీసర్‌గా ఉండటం అనేది నాకు దక్కిన అరుదైన అవకాశం. ఉదయం నుంచి డిస్కవరీ వెహికిల్‌లో కూర్చొని రోజంతా పెద్ద పెద్ద అధికారులతో చర్చిస్తూ తిరగడం, నా జీవితంలో ఓ గొప్ప రోజు. మాటల్లో వర్ణించలేను. బ్రిటిష్ హై కమిషనర్ మా బస్తీకి వచ్చి, నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూశారు. మా బస్తీవాసులతో మాట్లాడారు. వాళ్లందరి సమక్షంలో నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
లండన్ లో రోడ్డు ప్రమాదం
-
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్‌లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్‌లోనో, నైన్త్ క్లాస్‌లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్‌లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్‌కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసుకుని ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్‌కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్‌లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్‌క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్‌లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్‌లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిషన్‌కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్‌లో, న్యూయార్క్‌లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్‌కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు... అన్నీ హ్యాండ్‌మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్‌లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్‌లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్‌లో ఒక ఫ్యాబ్రిక్‌కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్‌ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్‌ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్‌కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్‌ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్‌స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
భార్యను చంపి.. చెత్త డబ్బాలో పెట్టి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన వివాహిత శ్వేత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. పాయింట్ కుక్ ప్రాంతంలోని మిర్కా వేలో ఇటీవల ఈ దారుణం చోటు చేసుకుంది. విక్టోరియా బిక్లీలోని కచ్చా రోడ్డు పక్కన చెత్త డబ్బాలో ఉన్న మృతదేహాన్ని విక్టోరియా పోలీసులు గుర్తించారు. తర్వాత హతురాలి భర్తే వచ్చి లొంగిపోవడంతో అతన్ని అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. నగరంలోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత బాల్శెట్టి గౌడ్ కుమార్తె మధుగాని చైతన్య అలియాస్ శ్వేత కొన్నేళ్ల క్రితం వరికుప్పల అశోక్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇతను కూడా హైదరాబాద్ వాసే అని తెలుస్తోంది. కాగా వీరి పెళ్లిని ఇరుపక్షాల కుటుంబాలూ అంగీకరించలేదని సమాచారం. కత్తితో పొడిచి, బెడ్‌షీట్‌లో చుట్టి.. వివాహానంతరం అశోక్‌రాజ్, శ్వేత ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమ ఇంట్లోనే శ్వేతను కత్తితో పొడిచి చంపిన అశోక్ శవాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలో పెట్టాడు. తన వాహనంలో ఆ డబ్బాను పెట్టుకుని మిర్కా వేకు 82 కిమీ దూరంలో ఉన్న బిక్లీ ప్రాంతంలోని ఓ నిర్మానుష్యమైన కచ్చా రోడ్డు పక్కన పొదల్లో పడేశాడు. అనంతరం తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. బాలుడిని తమ ఇంట్లో వదిలేసి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ లోపు బిక్లీ ప్రాంతానికి చెందిన స్థానికులు అనుమానాస్పదంగా పడి ఉన్న చెత్త డబ్బాను గుర్తించారు. దీంతో విక్టోరియా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షలకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే హతురాలు శ్వేత అని, ఆమె భర్త తన కుమారుడితో కలిసి ఇటీవలే హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా తిరిగి వెళ్లిన అశోక్ విక్టోరియా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో వారు అశోక్‌ను అరెస్టు చేశారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా.. శ్వేత మృతదేహంతో కూడిన డబ్బా పడున్న మార్గం పెద్దగా వినియోగంలో ఉండదని, రోజుకు కేవలం రెండుమూడు వాహనాలు మాత్రమే తిరుగుతూ ఉంటాయని బిక్లీలోని స్థానికులు అక్కడి మీడియాకు చెప్తున్నారు. మిర్కా వే ప్రాంతంలో తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్వేత... ఇరుగుపొరుగు వారికి అవసరమైనప్పుడు, కీలక రోజుల్లో భోజనం తదితరాలను అందజేసేదని తెలుస్తోంది. దీంతో ఆమె హత్య విషయం తెలిసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. శ్వేత వ్యవహారశైలిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారని ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే అవకాశం లేదని, అక్కడే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. -
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువతి హత్య
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం బక్‌లేలో దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన వివాహిత చైతన్య మదగాని అలియాస్ శ్వేత శనివారం హత్యకు గురైంది. చైతన్యను చంపిన దుండుగులు ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన చెత్త డబ్బాలో పారేశారు. హత్యకు సంబంధించి సెకండ్ క్రైమ్ సీన్‌ను పాయింట్ కుక్లోని మిర్కా వేలో ఉన్న చైతన్య ఇంట్లో పోలీసులు రీ క్రియేట్ చేశారు. అయితే హత్య చేసిన వాళ్లు చైతన్యకు తెలిసిన వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. ఆమెను చంపినతర్వాత దుండగులు వేరే దేశానికి పారిపోయారని తెలిపారు. హత్య చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. కాగా, శ్వేత భర్త, మూడేళ్ల కొడుకు హైదరాబాద్ వచ్చేశారు. ఇదీ చదవండి.. కర్రతో బాది యువకుడకి హత్య -
అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ
భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి కుబేరులు ఎప్పటికప్పుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల ఓ ఖరీదైన కారుని వారికంటే ముందే, హైదరాబాద్ మహిళ కొనుగోలు చేసింది. హైదరాబాద్ వాసి 'హర్షిక రావు' ఇటీవలే రూ. 2.55 కోట్ల లోటస్ ఎలెట్రే ఎలక్రిక్ కారును కొనుగోలు చేసి, ఈ కారు కొన్న మొట్ట మొదటి భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: నీతా అంబానీ వాడే ఫోన్ ధర రూ.400 కోట్లా? అసలు నిజమేంటంటే? పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. Eletre అండ్ Eletre S మోడల్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్-మోటార్ సిస్టమ్‌ను కలిగి 600 కిమీ రేంజ్ అందిస్తాయి. Eletre R మోడల్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ 22 kWh AC ఛార్జర్ కూడా పొందుతుంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం
వాషింగ్టన్: గతనెల చికాగో వీధుల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించిన హైదరాబాదీ యువతికి వైద్య సదుపాయాన్ని కల్పించడం తోపాటు ఆమెను తిరిగి భారత దేశానికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేసింది చికాగోలోని భారత ఎంబసీ. ఈ విషయాన్ని బాధితురాలి తల్లికి తెలియజేశామని ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ డెట్రాయిట్‌లోని ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికా వెళ్లింది. కానీ అక్కడ ఆమె వస్తువులను దుండగులు దొంగిలించడంతో దిక్కుతోచని స్థితిలో చికాగో వీధుల్లో తిరుగాడుతూ కనిపించింది. అత్యంత దీనావస్థలో తినడానికి తిండిలేక దయనీయ స్థితిలో ఉండిపోయిన ఆమెను గురించి తెలంగాణలోని మజ్లీస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అజ్మద్ ఉల్లా ఖాన్ బాధితురాలి తల్లి రాతపూర్వకంగా చేసిన విజ్ఞప్తిని ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. అజ్మద్ ఉల్లా ఖాన్ ట్వీట్‌కు స్పందిస్తూ కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ వెంటనే విషయాన్ని చికాగోలోని భారత ఎంబసీ దృష్టికి తీసుకుని వెళ్ళగా అక్కడివారు ఆమెను కనుగొని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రయాణించే పరిస్థితుల్లో లేదని ముందు తనకు వైద్యం అవసరమని తెలిపిన యూఎస్ ఎంబసీ ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలిపింది. దీంతో సైదాను తిరిగి భారత్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ అనే తల్లికి సమాచారమందించారు ఎంబసీ అధికారులు. ఇది కూడా చదవండి: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
ఒక కష్టం దశ... దిశను మార్చింది!!
ఓ పండు కన్నతల్లిని కాపాడింది... కన్న బిడ్డను రక్షించింది. ఒక బిడ్డగా ఒక తల్లిగా ఎదురైన అనుభవాలు... ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. కంప్యూటర్స్ నుంచి పంటపొలానికి దారి మళ్లించాయి. పంట పొలం నుంచి పరిశ్రమ దిశగా నడిపించాయి. ‘ఎన్ఆర్ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు చాలా సులువుగా ఖర్చు చేయగలుగుతారు. తిరిగి తాము పనిచేసే దేశాల్లో అంత డబ్బును సులువుగా సంపాదించుకోవచ్చనే ధీమా అది. అదే ఎన్ఆర్ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు సంపాదించడం చాలా కష్టం’ అన్నారు చికోటి కీర్తి. జీవితం నేర్పించిన పాఠాలనుంచి ఆమె తెలుసుకున్న జ్ఞానం అది. ‘నా జీవితమే నన్ను నడిపించింది. హైదరాబాద్‌లో కంప్యూటర్ సెంటర్ నిర్వహించి, పెళ్లితో నైజీరియా వెళ్లాను. ముగ్గురు పిల్లల తల్లిగా ఇండియాకి వచ్చి నా సవాళ్లకు జవాబుల కోసం అన్వేషణ మొదలు పెట్టాను. సంజీవనిలాంటి పరిష్కారం దొరికింది. తొగరు పండు నన్ను పారిశ్రామికవేత్తగా మార్చింది’ అని క్లుప్తంగా వివరించారు కీర్తి. విజయవంతమైన కీర్తి ప్రయోగాల జీవితం ఇలా సాగింది. బాబు తక్కువ బరువుతో పుట్టాడు ‘‘నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. బీఎస్సీ కంప్యూటర్స్ చేసి లిబర్టీ సెంటర్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించాను. నాన్న నైజీరియాలో మెకానికల్ ఇంజనీర్, అమ్మ మా కోసం గాంధీ హాస్పిటల్లో గవర్నమెంట్ ఉద్యోగం మానేసింది. మూడు నెలలకోసారి ఎవరో ఒకరు ఇండియా– నైజీరియాల మధ్య ప్రయాణించేవాళ్లం. పెళ్లి కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్న ఇక్కడి అబ్బాయితో కుదరడం యాదృచ్ఛికమే. నా పిల్లలు ఇండియాలోనే పుట్టాలనే ఆకాంక్ష కొద్దీ మూడు డెలివరీలకూ ఇండియాలోనే ప్లాన్ చేసుకున్నాను. రెండవసారి గర్భిణిగా ఉన్న సమయంలో సరిగ్గా ఏడవ నెలలో అమ్మ ఆరోగ్యం మా కుటుంబాన్ని కుదిపేసింది. అక్కడ (నైజీరియా) మలేరియా సర్వసాధారణం. అమ్మకు మలేరియా మెదడుకు సోకడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అక్కడ అన్నిరకాల వైద్యం అందించిన తర్వాత ఇండియాకి తీసుకువచ్చి డాక్టర్ సూచనతో నోని ఫ్రూట్ (తొగరు పండు) జ్యూస్ పట్టించాం. ఆమె రికవరీ స్పీడ్ మాకే ఆశ్చర్యం కలిగింది. నా డెలివరీ టైముకు పూర్తిగా కోలుకుని అంతా తనే చూసుకుంది. నాకది మిరకిల్. అయితే ఆ మిరకిల్ నా తదుపరి జీవితానికి ఒక సంకేతమని ఆ తర్వాత తెలిసింది. నాకు బాబు డౌన్ సిండ్రోమ్‌తో పుట్టాడు. బరువు ఒకటిరన్నర కిలోలు. మేము ఏ మాత్రం ఊహించని పరిణామం అది. నాలుగు నెలలు నిండినా బరువు గ్రాము కూడా పెరగ లేదు. డాక్టర్లు ఏ భరోసా ఇవ్వలేకపోయారు. అప్పుడు అమ్మ తనను కాపాడిన నోని జ్యూస్ బాబు ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుందేమో చూద్దామన్నది. దేవుడి మీద భారం వేసి పట్టించాం. నెల రోజుల్లో ఏడు వందల గ్రాములు పెరిగాడు. అప్పటి నుంచి నోని మీద రీసెర్చ్ మొదలు పెట్టాను. కంపెనీ మాట మార్చింది మార్కెట్లో ఉన్న నోని ఫ్రూట్ జ్యూస్ కంపెనీలను సంప్రదించాను. ఇదీ అదీ అనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న సమాచారాన్నంతటినీ సేకరించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అదే సమయంలో అమ్మ ఆరోగ్య దృష్ట్యా నాన్న బయటి దేశాల్లో ఉండడానికి ఇష్టపడక ఉద్యోగం మానేసి ఇండియాకి వచ్చేశారు. ఆయన తనకంటూ వ్యాపకం కోసం వ్యవసాయం చేయాలనుకున్నారు. అలా పదెకరాల పొలం కొని తొగరు చెట్లను పెంచాం. ఓ కంపెనీ ఇచ్చిన భరోసాతో పంటను యాభై ఎకరాలకు విస్తరించాం. అయితే పంట పెద్ద మొత్తంలో వచ్చే సమయానికి కంపెనీ మాకిచ్చే ధర తగ్గించింది. ఖర్చులు కూడా రానంత తక్కువ ధరకు అమ్మడంకంటే ఈ పండ్లతో మనమే పరిశ్రమ స్థాపిద్దామనే ఆలోచన వచ్చింది. అప్పటి వరకు మా కుటుంబ అవసరాలకు తగినట్లు తయారు చేస్తున్న జ్యూస్, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి మొత్తం పాతిక రకాల ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తయారు చేసి ‘చెక్ బయో ఆర్గానిక్స్’ పేరుతో మార్కెట్లోకి వచ్చాం. మా పొలంలో పండించి తయారు చేయడం వల్ల క్వాలిటీ విషయంలో మోసపోవడం, రాజీ పడడం రెండూ ఉండవు. మా అమ్మను, నా బిడ్డను కాపాడిన ఈ పండులోని ఔషధగుణాలను ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో సంజీవని వంటి ఈ పండును ఎన్ని రకాలుగా అందించవచ్చనే పరిశోధనలు చేస్తున్నాను. ప్రభుత్వ అనుమతుల ప్రకారం సర్టిఫికేట్లతోపాటు నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ పురస్కారం అందుకున్నాను’’ అని తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన వైనాన్ని వివరించారామె. ‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అన్నారు కీర్తి. సంజీవని పండుతో పరిశోధన తొగరు చెట్లు చలిని తట్టుకోలేవు. పాశ్చాత్య దేశాల్లో ఈ పండు మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఈ పంట అక్కడ పండదు. కాబట్టి ఎన్నో ఔషధగుణాలున్న సంజీవని వంటి ఈ పండుకు ప్రచారం కూడా పెద్దగా లభించలేదు. ఈ పండు నేరుగా మన దేహంలోని కణాల మీద పనిచేస్తుంది. అనేక రోగాలను నయం చేస్తుంది. కణాల శక్తిని పెంచి, దేహాన్ని వ్యర్థరహితం, విషరహితం చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకు కూడా మంచి గుణాన్నిస్తుంది. అనారోగ్యాలు వచ్చిన తర్వాత స్వస్థత కోసం వాడడమే కాదు. మామూలు వాళ్లు కూడా రోజుకు 30 మిల్లీలీటర్ల రసం తాగితే సమగ్రమైన ఆరోగ్యం చేకూరుతుంది. రసాయన రహితంగా తయారు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ వచ్చింది. ఆయుష్ అనుమతి కోసం అప్లయ్ చేశాను. – చికోటి కీర్తి ఫౌండర్, చెక్ బయో ఆర్గానిక్స్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
Mahati Kaumari: నాతో నేనే పోటీ పడ్డాను..!
ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిసెస్ గ్రాండ్ సీ వరల్డ్ 2023 (29–40 ఏళ్లలోపు పెళ్లైన మహిళలకు నిర్వహించే కాంటెస్ట్) పోటీల్లో హైదరాబాద్ వాసి శ్రీమతి మహతి కౌమారి 2వ స్థానం దక్కించుకుంది. మలేషియా దక్షిణాఫ్రికా సహా 15 దేశాల నుంచి 45 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం గురించి, తనను తాను కొత్తగా మెరుగు పరుచుకునే విధానాల గురించి వివరించింది మహతి కౌమారి. ‘మన పరిధిని విస్తరించుకుంటేనే అవకాశాలు పెరుగుతాయి, ఏ కిరీటాలైనా దక్కుతాయి’ నవ్వుతూ వివరించింది. ‘‘సొంతంగా ఎదగాలన్న ఆలోచనే ఈ రోజు నన్ను ఎల్లలు దాటేలా చేసింది. పదేళ్లు ఐటీ కంపెనీలలో వర్క్ చేశాను. పెళ్లి, ఇద్దరు పిల్లలు, కుటుంబం.. జీవితం ఒక దశ నుంచి మరో దశకు తీసుకెళుతూనే ఉంది. దీనితోపాటు నా కలలను కూడా తీర్చుకునే క్రమంలో నాతో నేనే పోటీపడుతుంటాను. కాలేజీ రోజుల నుంచి నా డ్రెస్సులు నేనే స్వయంగా డిజైన్ చేసుకునేదాన్ని. రీ సైక్లింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపేదాన్ని. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా నా ఈ అలవాటు మానుకోలేదు. నా స్నేహితులు, సహోద్యోగులు నా డ్రెస్సింగ్ గురించి అడిగేవారు. వాళ్లూ తమకు డ్రెస్‌లు డిజైన్ చేయమని కోరేవారు. అలా మా బంధుమిత్రుల్లో అడిగిన వారికి నాకున్న ఖాళీ సమయాన్ని కేటాయించి డిజైన్ చేసిచ్చేదాన్ని. నేను డిజైన్ చేసిచ్చిన డ్రెస్సుల్లో వారిని చూసినప్పుడు చాలా ఆనందం కలిగేది. సొంతంగా డిజైనింగ్ స్టూడియో పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. కుటుంబం, ఉద్యోగం అనే వ్యాపకాలు ఉన్న నాకు సొంతంగా నా డిజైన్ స్టూడియో పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన పెరగడానికి నా డిజైన్స్ ఇష్టపడే బంధుమిత్రులే కారణం. మా కుటుంబం కూడా ఆమోదం తెలపడంతో ఉద్యోగం వదిలి, డ్రెస్ డిజైనింగ్లోకి వచ్చేశాను. ఎనిమిదేళ్లుగా డిజైనింగ్ స్టూడియో నడుపుతున్నాను. మొదట ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చిన నేను, ఇప్పుడు పదిహేనుమందికి ఉపాధి చూపించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు క్లాసులు కూడా ఇస్తుంటాను. బ్యూటీ కాంటెస్ట్‌తో మరో అడుగు ‘తెలిసిన వారికి వర్క్ చేసిస్తే సరిపోదు, నేను చాలామందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మంది మహిళలకు పని కల్పించేలా నన్ను నేను మలుచుకోవాలి..’ ఈ ఆలోచన నన్ను అవకాశాల కోసం వెతికేలా చేసింది. ఆన్లైన్లో మిసెస్ బ్యూటీ కాంటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు నా స్కూల్, కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాను. కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. మన దేశం నుంచే కాదు మరో పదిహేను దేశాల నుంచి చాలామంది మహిళలు ఈ పోటీలకు అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ తర్వాత మన దేశం నుంచి నేను ఎంపిక అయ్యాను. రెండు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకుని, పోటీల్లో పాల్గొన్నాను. ఇప్పుడు నాకు విదేశాలలోనూ స్నేహితులు పెరిగారు. పోటీలకు వచ్చిన వారందరితోనూ మంచి స్నేహం ఏర్పడింది. దీంతో నాకున్న అవకాశాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాను’’ అని వివరించి ఈ బ్యూటీ. మనసును సేదతీర్చేలా... కర్ణాటక సంగీతం నాకున్న మరో హాబీ. కుటుంబం, బిజినెస్ బాధ్యతలు ఎన్ని ఉన్నా నాకు ఇష్టమైన సంగీతాన్ని నిత్యం సాధన చేస్తూనే ఉంటాను. హాబీస్‌కి నాకంటూ కొంత సమయం కేటాయించుకోవడంలో ఏ మాత్రం అలక్ష్యం చేయను. పిల్లలు కూడా నా ఇష్టాలను ప్రోత్సహిస్తుంటారు. – నిర్మలారెడ్డి -
లండన్‌లో హైదరాబాద్ యువతి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్ రాజధాని లండన్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన యువతి తేజస్విని లండన్‌లో మాస్టర్స్ చదువుతోంది. తన మిత్రులతో కలిసి అక్కడే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో బ్రెజిల్‌కు చెందిన యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేయగా.. తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తండ్రి అనారోగ్యానికి గురవ్వగా ఆరు నెలల క్రితమే తేజస్విని ఇంటికి వచ్చి వెళ్లింది. మరో రెండు నెలల్లో తన చదువు పూర్తి చేసి ఇంటికి రావాల్సి ఉంది. అంతలోనే తన కూతురు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తేజస్వినికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఈ తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీమ్! తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్? -
హైదరాబాద్ యువతి హత్య కేసు.. అపార్ట్మెంట్లో ఆ రోజు ఏం జరిగింది?
కర్ణాటక: హైదరాబాద్‌కు చెందిన యువతి ఆకాంక్ష (23) హత్య కేసులో బెంగళూరు జీవన్ బీమానగర పోలీసులు ఆమె ప్రియుని కోసం అన్వేషణ చేపట్టారు. ఢిల్లీకి చెందిన అర్పిత్ (25) హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. వివరాలు.. బీకాం పూర్తి చేసిన ఆకాంక్ష బెంగళూరులో మార్కెటింగ్ సంస్థలో పని చేసేది. ఢిల్లీకి చెందిన ఆర్పిత్ కూడా ఆకాంక్ష పని చేస్తున్న సంస్థలోనే ఉద్యోగంలో చేరాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, ప్రేమకు దారి తీసింది. మొదట కొద్ది రోజులు ఒకే ఇంటిలో సహజీవనం చేశారు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌కు అర్పిత్ బదిలీ కాగా, ఆ రూంను ఖాళీ చేసిన ఆకాంక్ష స్నేహితురాలితో కలిసి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో బాడుగకు ఉంటోంది. ఆత్మహత్య అనేలా నాటకం ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేయాలని, పెళ్లి విషయంలో విభేదాలు వచ్చాయి. హైదరాబాదు నుంచి వచ్చిన అర్పిత్ సోమవారం ఆకాంక్షతో కలిసి నగరంలో షికార్లు చేశాడు. మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీనితో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత గొంతుకు చున్నీ బిగించి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ ఫ్యాన్‌కు వేలాడదీయలేక నేల మీద పడుకోబెట్టి ఫ్లాట్‌కి తాళం వేసుకొని పరారయ్యాడు. ఆకాంక్షతో పాటు అదే ఫ్లాట్‌లో ఉన్న స్నేహితురాలు కొన్ని గంటల తరువాత వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రుల రాక హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు, బంధువులు చేరుకుని విగతజీవిగా ఉన్న ఆకాంక్షను చూసి భోరున విలపించారు. తమ కూతురిని అర్పిత్ హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు జీవన్ బీమానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
లండన్‌లో హైదరాబాద్ యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్ టర్మ్ అయిపోయింది.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పిన ఆ యువతి శాశ్వతంగా సెలవు తీసుకుంది. హైదరాబాద్ యువతి సాయి తేజస్వి కొమ్మారెడ్డి (24) లండన్‌లో దుర్మరణం చెందింది. ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడం, మృతదేహం రావడానికి సమయం పడుతుండటంతో నగరంలోని ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు నగరంలోని ఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమార్తె తేజస్వి సైదాబాద్‌లో ఇంజనీరింగ్ (సీఎస్ఈ) పూర్తి చేశారు. లండన్‌లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లో వెళ్లారు. ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు. వెంట ఉన్న సహ విద్యార్థులు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి బలగాలు గాలించి తేజస్వి మృతదేహాన్ని గుర్తించి ససెక్స్ కౌంటీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తేజస్వి బంధువులు మృతదేహం ఇక్కడకు తరలించడానికి సహకరించాలని కోరారు. బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. మృతదేహం శుక్రవారం నాటికి నగరానికి చేరుకుంటుందని ఆమె కుటుంబీకులకు సమాచారం అందింది. ‘‘చనిపోవడానికి ముందు రోజు తేజస్వి తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడింది. ఫస్ట్ టర్మ్ పూర్తయిన విషయం చెప్పింది. వీలుంటే వారం లేదా పది రోజులు సెలవు తీసుకుని రమ్మని వాళ్లు చెప్పారు. ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉండటంతోసెర్మనీకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈలోపు ఇలా జరిగింది’’అని తేజస్వి బంధువులు తెలిపారు. చదవండి: ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఎత్తివేత -
హైదరాబాద్ యువతితో నైజీరియన్ స్నేహం.. గిఫ్ట్‌ల పేరుతో రూ. 1.22 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ పేరుతో మోసానికి పాల్పడ్డ నైజీరియన్ జంటను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 పాస్‌బుక్‌లు, 8 చెక్కు బుక్‌లు, 9 డెబిట్ కార్డులు, 12 మొబైల్ ఫోన్లు, 4 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, మూడు ఐడీకార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్‌పేర్కొన్నారు. వివరాలు నైజీరియాకు చెందిన బకయోకో లస్సినా, షోమా పుర్కయస్తా ప్రేమికులు. బకయోకో లస్సినా డాక్టర్ లియనార్డో మ్యాట్టియో అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్‌ను తెరచి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. నగరానికి చెందిన ఓ యువతి అతడి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా కొంతకాలం ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. తనను లండన్‌లో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఇతగాడు యువతి కోసం సిటీకి వస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీ కస్టమ్స్‌లో మీ కోసం వస్తున్న డాక్టర్ లియనార్డో మ్యాట్టియోను అరెస్టు చేశామని, అతడి వద్ద వజ్రాలు, విలువైన బహుమతులు, డబ్బును స్వాధీనం చేసుకున్నామంటూ సదరు యువతికి కస్టమ్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న షోమా పుర్కయస్తా ఫోన్ చేసి చెప్పింది. ఆమెను భయపెట్టి పలు దఫాలుగా రూ.1.22 కోట్లు పలు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయినా పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. ఇదే తరహాలో వీరు పలువురిని మోసం చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. -
Syeda Falak: బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు... కట్‌చేస్తే!
Syeda Falak: ఆకాశమే హద్దుగా...రేపు (డిసెంబర్ 17) మొదలయ్యే ‘ఆసియా కరాటే చాంపియన్‌షిప్’ పోటీలకు వేదిక కజకిస్థాన్. మధ్య ఆసియా దేశంలో జరిగే ఈ కరాటే పోటీలకు మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది సాయెదా ఫలక్. కరాటేలో 22 అంతర్జాతీయ పతకాలు, 20 జాతీయస్థాయి పతకాలను సాధించిన ఫలక్ ఈ రోజు కజకిస్థాన్‌కు బయలుదేరుతోంది. సాక్షితో మాట్లాడుతూ... భారత్‌కు మరో పతకాన్ని తీసుకు వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అంతా కాకతాళీయం హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సాయెదా ఫలక్ బీఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తోంది. తన పన్నెండేళ్ల వయసులో కాకతాళీయంగా మొదలైన కరాటే ప్రాక్టీస్ తన జీవితంలో భాగమైపోయిందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాస్‌లో ఉండగా మా స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో భాగంగా కరాటేని పరిచయం చేశారు. నేను బొద్దుగా ఉండడంతో బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు. ప్రాక్టీస్ మొదలైన పదిరోజుల్లోనే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్‌కి పేరు ఇచ్చేశారు మా స్కూల్ వాళ్లు. ఆ పోటీల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత ఏడాదే బ్లాక్ బెల్ట్ వచ్చింది. నా తొలి ఇంటర్నేషనల్ మెడల్ నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో వచ్చింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. నిజానికి అప్పటి వరకు కరాటే పట్ల పెద్ద సీరియెస్‌గా లేను. కోచ్ చెప్పినట్లు ప్రాక్టీస్ చేయడం, అమ్మానాన్నలు పోటీలకు తీసుకువెళ్తే నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వరకే ఉండేది. స్కూల్లో, బంధువుల్లో నన్ను ప్రత్యేకంగా గుర్తించడం, నా ప్రతి సక్సెస్‌నీ మా అమ్మానాన్న సంతోషంగా ఆస్వాదించడం, మీడియాలో కథనాలు రావడం... వంటివన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. కరాటేతో ఐడెంటిఫై అవ్వడం కూడా అప్పటి నుంచే మొదలైంది’’ అని గుర్తు చేసుకుంది ఫలక్. అడ్డంకులు లేవు కరాటే ప్రాక్టీస్ చేయడానికి మతపరమైన నిబంధనలు తనకు అడ్డుకాలేదని చెప్తూ ‘‘నాకంటే ముందు మా అక్క అయ్మాన్ స్పోర్ట్స్ ప్రాక్టీస్‌లో ఉంది. మా అమ్మానాన్నలిద్దరూ విశాల దృక్పథం ఉన్నవాళ్లే. దాంతో ఏ ఇబ్బందీ రాలేదు. కానీ, అప్పట్లో ‘కరాటే అనేది మగవాళ్ల రంగం, అమ్మాయి కరాటే ప్రాక్టీస్ చేయడం ఎందుకు’ అనే భావన మాత్రం వ్యక్తమయ్యేది. అది పద్నాలుగేళ్ల కిందటి మాట. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. పైగా ఇది స్వీయరక్షణ సాధనం అని అందరూ గుర్తిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో షీ టీమ్‌తో కలిసి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వివరిస్తూ వీడియో చేశాను. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో స్టూడెంట్స్‌కి కరాటే నేర్పిస్తున్నాను. పూర్తిస్థాయిలో కరాటే అకాడమీ స్థాపించి వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు స్వీయరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇవ్వాలనేది నా ఆకాంక్ష’’ అని చెప్పిందామె. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని కోరుకుంటోంది సాయెదా ఫలక్. ఫలక్ అంటే ఆకాశం అని అర్థం. స్టార్ క్యాంపెయినర్ సాయెదా ఫలక్ తాను సాధించిన పతకాలను చూసుకుంటూ అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది ‘యూఎస్ ఓపెన్ మెడల్’ అని 2016లో లాస్వేగాస్లో గెలుచుకున్న పతకాన్ని చూపించింది. క్రీడాకారిణిగా రాణిస్తున్న ఫలక్ అణగారిన వర్గాల మహిళల్లో చైతన్యం కలిగించడానికి రాజకీయరంగంలో అడుగుపెట్టి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసింది. ‘రాజకీయ రంగం అంటే మగవాళ్ల రంగం అనే భావన మహిళల్లో ఉందనే వాస్తవాన్ని ఆ ప్రచారం ద్వారానే తెలుసుకోగలిగాను. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పింది సాయెదా ఫలక్. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) View this post on Instagram A post shared by Syeda Falak (@falaksyeda7) -
హైదరాబాద్: వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్ తీసుకున్న ఏడుగురు ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుత్రుల్లో సోమవారం చేరిన విషయం తెలిసిందే. తాజాగా హైదరబాద్‌లోనూ ఇలాంటి పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ రియాక్షన్ కావడంతో ఓ మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరారు. జనవరి 16న నవీన అనే మహిళ ఉప్పల్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. అయితే అనుకోకుండా వంతులు, మైకం కమ్మడం, బలహీన లక్షణాలు ఏర్పడటంతో ఈ రోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం నవీన పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. చదవండి: కోవిషీల్డ్ వ్యాక్సిన్.. ఏడుగురికి అస్వస్థత కాగా భారతదేశమంతటా శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని ఉదయం 10.30 గంటలకు వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందజేశారు.మొత్తం 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 1075 నంబర్‌తో టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. చదవండి: కరోనా వ్యాక్సిన్ : మరుసటి రోజే విషాదం -
యూఎస్‌లో కారు ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
-
అమెరికాలో హైదరాబాద్ యువతి దుర్మరణం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి దుర్మరణం పాలైంది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.45 గంటలకు మిచిగాన్ వద్ద ఆగి ఉన్న కారును అతివేగంగా వచ్చిన మరో కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ముందు కారులో ఉన్న ఎల్ల చరితారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నేరేడ్మెట్లోని రేణుకానగర్‌కు చెందిన ఇంద్రారెడ్డి, శోభ దంపతులకు కుమార్తె చరితారెడ్డి, కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నారు. 8 నెలల క్రితం అమెరికాలోని డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చరితారెడ్డి అక్కడకు వెళ్లారు. మిచిగాన్‌లో ఉంటున్న ఆమె.. వీకెండ్ కావడంతో శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. మిచిగాన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారని మృతురాలి సోదరుడు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఈ విషయంలో మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకున్నారన్నారు. ప్రమాదం ముందురోజే తన సోదరి తమతో మాట్లాడిందని, హెచ్వన్ వీసా రాకపోతే హైదరాబాద్ వచ్చేస్తానని చెప్పిందని యశ్వంత్‌రెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి
నాగోలు: నగరానికి చెందిన ఓ మహిళ అమెరికాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. భర్త వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగోలు సాయినగర్కాలనీకి చెందిన గజం కృష్ణయ్య–పారిజాత దంపతుల రెండో కూతురు వనిత (30)కు కొత్తపేటకు చెందిన రాచకొండ శివకుమార్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శివకుమార్ అమెరికాలో నార్త్ కరోలినాలో నివాసముంటున్నాడు. వృత్తిరీత్యా సాప్ట్వేర్ ఇంజనీర్. నాలుగేళ్ల క్రితం ఇండియాలో ఉందామంటూ పిల్లలు, భార్యతో కలసి శివకుమార్ నగరానికి వచ్చాడు. 15 రోజుల తర్వాత ఇద్దరు పిల్లలను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి, భార్యను పుట్టింటిలో వదిలి అన్నీ సెటిల్ చేసుకొని వస్తానంటూ అమెరికా వెళ్లిపోయాడు. భార్యకు తెలియకుండానే ఇటీవల పిల్లలను అమెరికా తీసుకెళ్లాడు. అప్పటి నుంచి భార్యకు ఫోన్ చేయడంగానీ, అమెరికాకు తీసుకెళ్లేందుకుగానీ ప్రయత్నించలేదు. పెద్దల ఒత్తిడితో 4 నెలల క్రితం శివకుమార్ వీసా పంపడంతో ఆమె అమెరికా వెళ్లింది. కానీ శివకుమార్ తిరిగి భార్యను వేధించసాగాడు. భర్త వేధింపులు ఎక్కవ కావడంతో అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 4న సాయంత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ప్లాస్టిక్ కవర్‌ను తొడు క్కొని ఊపిరి ఆడకుండా చేసుకుని మృతి చెందినట్లు కృష్ణయ్య తెలిపారు. శివకుమార్ వేధింపుల కారణంగానే తన కూతురు వనిత మృతి చెందిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ సీఐని కృష్ణయ్య కోరారు. కూతురి మృతదేహాన్ని నగరానికి త్వరగా తీసుకొచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
అమెరికాలో హైదరాబాద్ యువతి మృతి
-
బాత్రూంలో నిర్బంధించి వేధిస్తున్నారని..
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ మహిళ గల్ఫ్ ఏజెంట్ల మోసానికి బలై దేశం కాని దేశంలో నిర్బంధానికి గురైంది. నగరంలోని కుషాయిగూడ సోనియాగాంధీ నగర్‌కు చెందిన మంజుల(36) మెరుగైన ఉపాధి కోసం ఏజెంట్ సాయంతో సౌదీ అరేబియాకు వెళ్లింది. కాగా.. అక్కడ తనకు నిత్య నరకం చూపిస్తున్నారని.. బాత్రూంలో బంధించి హింసిస్తున్నారని భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో తన భార్యను సౌదీఅరేబియా నుంచి రప్పించాలంటూ ఆమె భర్త రవి తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
రాజధానిలో మరో ఘోరం
-
నా చావుకు ఎవరూ కారణం కాదు: సూసైడ్ నోట్
బాపట్ల టౌన్(గుంటూరు) : విహారయాత్ర కోసమని వచ్చిన ఓ వివాహిత రిసార్ట్స్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా సూర్యలంకలో చోటుచేసుకున్న శనివారం ఉదయం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన కరాభి త్రిపాఠి (30), భర్త తపన్ త్రిపాఠితో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మలేషియన్ టవర్స్‌లో నివాసం ఉంటోంది. తపన్ హైటెక్ సిటీలోని బ్యాంక్ ఆఫ్ ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. గత నెలలో కరాభి తన భర్త, చెల్లెలు, ఆమె పిల్లలతో కలిసి సూర్యలంక తీరానికి విహారయాత్రకు వచ్చింది. తీరంలోని రిసార్ట్స్‌లో వీరంతా రెండు రోజులు గడిపారు. గురువారం మధ్యాహ్నం కరాభి భర్తకు ఊరికెళ్లి రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పి బయలుదేరింది. శుక్రవారం ఉదయం సూర్యలంక హరితా రిసార్ట్స్‌కు చేరుకుంది. అప్పటికే ఆన్లైన్లో రూము బుక్ చేసుకున్న ఆమెకు రిసార్ట్స్ సిబ్బంది శుక్రవారం ఉదయం 7 గంటలకు రూము ఇచ్చారు. శనివారం ఉదయం బాయ్ వెళ్లి తలుపుతట్టాడు. అయితే ఎంతకు తలుపు తీయకపోవడంతో ఉదయం 9 గంటల వరకు వేచిచూసి కిటికీ తలుపు పగులకొట్టి చూశారు. ఆమె మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే రిసార్ట్స్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. దయచేసి నా భర్తను, కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేయవద్దు’ అంటూ రాసిన సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో లభ్యమైంది. -
మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ మృతి
-
మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ మృతి
హైదరాబాద్: మక్కాలో గురువారం చోటుచేసుకున్న హజ్ యాత్రికుల తొక్కిసలాటలో హైదరాబాద్ మహిళ బీబీ జాన్ ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బీబీ జాన్ రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌కు చెందిన మహిళ. ఆమె మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా మక్కాకు బయలుదేరి వెళ్లి దురదృష్టవశాత్తు మృత్యువాత పడింది. రంగారెడ్డిజిల్లాకు చెందిన బీబీ జాన్ ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఉంటోంది. మరోపక్క, తెలంగాణ ప్రాంతం నుంచి మక్కాకు వెళ్లిన తమ వారి వివరాలు తెలుసుకునేందుకు హజ్ కమిటీ ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. వివరాలు పొందగోరువారు 040-23214125కు ఫోన్ చేయవచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి మహ్మద్ అలీ హజ్ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.