
బాత్‌రూంలో నిర్బంధించి వేధిస్తున్నారని..
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ మహిళ గల్ఫ్ ఏజెంట్ల మోసానికి బలై దేశం కాని దేశంలో నిర్బంధానికి గురైంది. నగరంలోని కుషాయిగూడ సోనియాగాంధీ నగర్‌కు చెందిన మంజుల(36) మెరుగైన ఉపాధి కోసం ఏజెంట్ సాయంతో సౌదీ అరేబియాకు వెళ్లింది. కాగా.. అక్కడ తనకు నిత్య నరకం చూపిస్తున్నారని.. బాత్‌రూంలో బంధించి హింసిస్తున్నారని భర్తకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది.
దీంతో తన భార్యను సౌదీఅరేబియా నుంచి రప్పించాలంటూ ఆమె భర్త రవి తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.