అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ | Hyderabad Woman Buys First Lotus Eletre EV In India - Sakshi
Sakshi News home page

అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ

Jan 29 2024 11:55 AM | Updated on Jan 29 2024 12:14 PM

First Owner Of Lotus Eletre Ev In India - Sakshi

భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి కుబేరులు ఎప్పటికప్పుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల ఓ ఖరీదైన కారుని వారికంటే ముందే, హైదరాబాద్ మహిళ కొనుగోలు చేసింది.

హైదరాబాద్ వాసి 'హర్షిక రావు' ఇటీవలే రూ. 2.55 కోట్ల లోటస్ ఎలెట్రే ఎలక్రిక్ కారును కొనుగోలు చేసి, ఈ కారు కొన్న మొట్ట మొదటి భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇదీ చదవండి: నీతా అంబానీ వాడే ఫోన్‌ ధర రూ.400 కోట్లా? అసలు నిజమేంటంటే?

పవర్‌ట్రెయిన్‌ విషయానికి వస్తే.. Eletre అండ్ Eletre S మోడల్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్-మోటార్ సిస్టమ్‌ను కలిగి 600 కిమీ రేంజ్ అందిస్తాయి. Eletre R మోడల్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ 22 kWh AC ఛార్జర్ కూడా పొందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement