ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. శాశ్వత, తాత్కాలిక ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఒక నోటీసును ప్రచురించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రాథమిక అర్హత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి.
ఇంకా ఏమేం ఉండాలంటే..
ఖతార్‌లోని ఇండియన్ ఎంబసీలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా గుర్తింపు ఉన్న సంస్థ లేదా కార్యాలయంలో క్లరికల్ పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
అరబిక్‌లో ప్రావీణ్యం అదనపు అర్హత. అభ్యర్థులు తమ అదనపు అర్హతలు, పని అనుభవం లేదా సర్టిఫికెట్లను అప్లికేషన్‌లో చూపవచ్చు. అన్ని అలవెన్సులతో కలిపి నెలవారీ జీతం 5,500 ఖతార్ రియాల్స్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1.25 లక్షలు ఉంటుంది. చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న అభ్యర్థులు 2024లోపు ఏప్రిల్ 7 దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పంపడానికి ప్రచురించిన నోటీసుతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో లింక్ అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment