15 రోజుల్లో పెళ్లి.. పాస్‌పోర్టు పోయింది! | Sushma Swaraj Helped To This Man Who Has To Travel For His Wedding | Sakshi
Sakshi News home page

‘రాంగ్‌ టైమ్‌లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నారు’

Published Tue, Jul 31 2018 3:19 PM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

Sushma Swaraj Helped To This Man Who Has To Travel For His Wedding - Sakshi

విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విటర్‌ వేదికగా సాయం కోరితే ఆమె వెంటనే స్పందిస్తారు. తాజాగా రవితేజ అనే వ్యక్తికి కూడా ఆమె సాయం చేశారు. ‘వాషింగ్టన్‌లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నాను... వచ్చే నెల(ఆగస్టు) 13- 15 మధ్య నా వివాహ తేదీని ఖరారు చేశారు. అందువల్ల ఆగస్టు 10న బయల్దేరాలి కాబట్టి తత్కాల్‌లో పాస్‌పోర్టు జారీ చేయాలని’ అతడు ట్విటర్‌ వేదికగా సుష్మాను సాయం కోరాడు. 

రవితేజ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుష్మా స్వరాజ్‌ సానుకూలంగా స్పందించారు. ‘రవితేజ.. మీరు చాలా రాంగ్‌ టైమ్‌లో పాస్‌పోర్డు పోగొట్టుకున్నారు. అయినప్పటికీ  మీ పెళ్లి సమయానికి మండపానికి చేరేలా మేము సాయం చేస్తామని’  ట్వీట్‌ చేసిన సుష్మా.. మానవతా దృక్పథంతో అతడికి సాయం అందించాలంటూ అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీని కోరారు. ఆమె ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు మాత్రం.. ‘మీ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కు హ్యాట్సాప్‌ మేడమ్‌.. మీరు మా విదేశాంగ శాఖ మంత్రిగా ఉండటం మా అదృష్టం’ అంటూ ప్రశసంలు కురిపిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement