రష్యా ఈరోజు ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో ఆ దేశం తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఎయిర్ ఇండియా విమానాన్ని మధ్యలోనే వెనక్కి తిప్పవలసి వచ్చంది. అంతే తన కొడుకు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు అంటూ ఆందోళన చెందిన తండ్రి ప్రభుత్వం నుంచి సహాయం కోసం విజ్ఞప్తి చేశాడు.
ఈ మేరకు ఆ తండ్రి రవి మాట్లాడుతూ..."నా కొడుకు కైవ్ నుండి ఢిల్లీకి విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ పౌర గగనతలం మూసివేయబడింది. వారికి విమానాశ్రయంలో బాంబులు వినిపించాయి. వారిని విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇప్పుడు వారు కైవ్ వీధుల్లో చిక్కుకున్నారు. మీకు వీలైతే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించమని చెప్పగలిగితే తాను తన కొడుకు నెంబర్‌ని ఇస్తానని మొరపెట్టుకుంటున్నాడు. తన కుమారుడి పరీక్షలు బుధవారంతో ముగిశాయని, అయితే అతను ఈరోజుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాడని చెప్పాడు.
ఇలా జరుగుతుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. అతను పరీక్షలు ముగియడంతో అతను ఈ రోజు తన ఫ్లైట్‌లో వెళ్లాలని అనుకున్నాడు. తన కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి రావలనే ఉద్దేశంతోనే టిక్కెట్ ధర రెట్టింపు అయినా సరే చెల్లించి మరీ ఫ్లైట్ టికెట్ బుక్ చేశానని చెప్పాడు. ఉక్రెయిన్‌ను విడిచిపెట్టమని పౌరులకు ప్రభుత్వం ఇచ్చిన సలహా కూడా ఆలస్యంగా వచ్చింది.
కానీ ఇప్పుడు వారు చిక్కుకుపోయారు ప్రభుత్వం వారికి సహాయం చేయాలి" అని బాధితుడి తండ్రి ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. నిజానికి ఉక్రెయిన్‌లో సుమారు 15,000 మందికి పైగా భారతీయులు ఉన్నారు. భారతీయుల భద్రతోపాటు ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని భారతీయులను ఉద్దేశించి భారత్ .. ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి మీరు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా, సురక్షితంగా ఉండండి.
అది మీ ఇళ్లలో, హాస్టళ్లలో, వసతిలో లేదా ప్రయాణంలోనై సరే " అని సూచించింది. ఈ మేరకు కైవ్‌కి ప్రయాణించే వారందరూ, కైవ్‌లోని పశ్చిమ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారితో సహా, తాత్కాలికంగా తమ తమ నగరాలకు, ముఖ్యంగా పశ్చిమ సరిహద్దు దేశాలలో సురక్షితమైన ప్రదేశాలకు తిరిగి రావాలని సూచించారు." ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడిన తర్వాత ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం ఖాళీగా తిరిగి వచ్చింది. అంతేకాదు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య, భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అనేక విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియాతో సహా ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.
(చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 18 వేల మంది భారతీయులు ? ఆగిపోయిన ఎయిర్ లిఫ్ట్)
Comments
Please login to add a commentAdd a comment