హైదరాబాద్ ఓ మినీ భారత్: నాదెండ్ల భాస్కరరావు | Hyderabad is a Mini India: Nadendla Bhaskara Rao | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఓ మినీ భారత్: నాదెండ్ల భాస్కరరావు

Published Wed, Oct 23 2013 2:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ ఓ మినీ భారత్: నాదెండ్ల భాస్కరరావు - Sakshi

హైదరాబాద్ ఓ మినీ భారత్: నాదెండ్ల భాస్కరరావు

 హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మినీ ఇండియా వంటిదని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అభివర్ణించారు.  నాంపల్లి గాంధీభవన్ ప్రకాశం హాలులో నేషనల్ సాలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల పాకిస్థాన్ సైనికుల చేతిలో మృతి చెందిన అమర సైనికుడు ఫిరోజ్‌ఖాన్ సంతాప సభ ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఫిరోజ్‌ఖాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ సమైక్యతా కమిటీ అధ్యక్షుడు ఎస్‌కే.అఫ్జలుద్దీన్, పీసీసీ కార్యదర్శి ఎస్.బాలపోచయ్య, భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ స్వరవ ర్షిణి రాజేందర్‌రెడ్డి, సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సభ్యులు ఖలీఖుర్ రెహ్మాన్  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement