సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్‌లో నేడు ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం కొనసాగుతోంది. మూడు విడతలుగా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఇంచార్జ్‌లు, అసెంబ్లీ ఇంచార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ సమావేశంలో ముందస్తు ఎన్నికలు, పార్టీ బలోపేతం, శక్తి యాప్‌లపై తీవ్రంగా చర్చించారు.
ఈ సమావేశ తీరుపై టీ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ సమావేశానికి సీనియర్లు, సిటింగ్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదని సమాచారం. టీపీసీసీపై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతేకాక కత్తి వెంకటస్వామిని నర్సంపేట కాంగ్రెస్ నేతగా పరిచయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నాలుగు వేల ఒట్లు తెచ్చుకొని నేతను నాతో సమానమైన హోదా కల్పిస్తారా అని మాధవ రెడ్డి మండిపడ్డారు. మాధవ రెడ్డి ఆగ్రహంతో పీసీసీపైకి దూసుకెళ్లారు. నీ వల్లె పార్టీ నాశనం అవుతుందని అంటూ తీవ్ర పీసీసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన ముగ్గురు సహాయ ఇంచార్జీలకు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించామన్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. బూత్, మండల, జిల్లా కమిటీలను జూలై 10లోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. జూలై 1 నుంచి 15లోపు సహాయ ఇంచార్జీలు వారికి కేటాయించిన జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తారు. క్షేత స్థాయి పార్టీ పరిస్థితులపై నేతల అభిప్రాయం పీసీసీ తీసుకుందన్నారు. మరో మూడు నాలుగు రోజులు సహాయ ఇంచార్జ్‌లు వారికి కేటాయించిన నియోజకవర్గ నేతలతో సమాలోచనలు చేస్తారు. మీటింగ్‌కు హాజరుకాని సీనియర్‌లు పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోతున్నామని పీసీసీకి వివరణ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment