Ramachandra khuntia
-
ఏఐసీసీ మీటింగ్.. పీసీసీపై ఎమ్మెల్యే ఫైర్
-
ఏఐసీసీ మీటింగ్.. పీసీసీపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్‌లో నేడు ఏఐసీసీ కార్యదర్శుల సమావేశం కొనసాగుతోంది. మూడు విడతలుగా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఇంచార్జ్‌లు, అసెంబ్లీ ఇంచార్జ్‌లు, డీసీసీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ సమావేశంలో ముందస్తు ఎన్నికలు, పార్టీ బలోపేతం, శక్తి యాప్‌లపై తీవ్రంగా చర్చించారు. ఈ సమావేశ తీరుపై టీ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ సమావేశానికి సీనియర్లు, సిటింగ్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదని సమాచారం. టీపీసీసీపై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతేకాక కత్తి వెంకటస్వామిని నర్సంపేట కాంగ్రెస్ నేతగా పరిచయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నాలుగు వేల ఒట్లు తెచ్చుకొని నేతను నాతో సమానమైన హోదా కల్పిస్తారా అని మాధవ రెడ్డి మండిపడ్డారు. మాధవ రెడ్డి ఆగ్రహంతో పీసీసీపైకి దూసుకెళ్లారు. నీ వల్లె పార్టీ నాశనం అవుతుందని అంటూ తీవ్ర పీసీసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన ముగ్గురు సహాయ ఇంచార్జీలకు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించామన్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితిని సమీక్షించామని తెలిపారు. బూత్, మండల, జిల్లా కమిటీలను జూలై 10లోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. జూలై 1 నుంచి 15లోపు సహాయ ఇంచార్జీలు వారికి కేటాయించిన జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తారు. క్షేత స్థాయి పార్టీ పరిస్థితులపై నేతల అభిప్రాయం పీసీసీ తీసుకుందన్నారు. మరో మూడు నాలుగు రోజులు సహాయ ఇంచార్జ్‌లు వారికి కేటాయించిన నియోజకవర్గ నేతలతో సమాలోచనలు చేస్తారు. మీటింగ్‌కు హాజరుకాని సీనియర్లు పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోతున్నామని పీసీసీకి వివరణ ఇచ్చారని తెలిపారు. -
'ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు'
♦ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్ ఇళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి ♦ బీజేపీ నేతలకు ఒక విధానం.. ప్రతిపక్ష పార్టీలకు మరో విధానమా?: ఏఐసీసీ నేత కుంతియా ♦ అవినీతి కేసులున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎం ఇళ్లపై దాడులు ఎందుకు జరగడంలేదు?: రామచంద్ర కుంతియా హైదరాబాద్/ఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ తీరుకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని ఏఐసీసీ నేత రామచంద్ర కుంతియా పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఇళ్లపై సీబీఐ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అవినీతి కేసులున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంల ఇళ్లపై ఎందుకు సీబీఐ దాడులు జరగడం లేదని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ఒక విధానం.. ప్రతిపక్ష పార్టీలకు మరో విధానమా? అంటూ ధ్వజమెత్తారు. -
సభ్యత్వం ఇంతేనా..?
కాంగ్రెస్ నేతల అలసత్వంపై కుంతియా ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు తీరుపై ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు తీరుతెన్నులపై కుంతియా మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యనేతలు మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, డీఎస్, పొన్నాలతో పాటు ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యం గా పెట్టుకున్నామని పేర్కొంటూ... సభ్యత్వ వివరాలను పార్టీ ప్రధా న కార్యదర్శి సి.జె.శ్రీనివాస్ వివరించారు. దీనిపై స్పందించిన కుంతియా... ‘‘తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ సభ్యత్వానికి విస్తృత ఆదరణ వస్తుందని సోనియాగాంధీ ఆశావహంగా ఉన్నారు. కానీ సభ్యత్వ పరిస్థితిని చూస్తే లక్ష్యంలో సగానికి కూడా చేరుకోలేదు. ఎందుకిలా జరుగుతోంది? సభ్యత్వ నమోదుపై ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు..’’ అని ప్రశ్నించారు. అనంతరం కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలసి జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు పరిస్థితిని సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సమీక్ష సందర్భంగా పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయలోపాన్ని పలువురు ప్రస్తావించారు. ఖమ్మం జిల్లా సమీక్ష సందర్భంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.. వారి జిల్లాలో సభ్యత్వం ఎక్కువగానే జరిగినా, గాంధీభవన్‌లో ఇన్చార్జిగా ఉన్న సి.జె.శ్రీనివాస్ వివక్షతో తక్కువ సంఖ్యను చూపించి, అవమానించారంటూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇక మిగతా జిల్లాల్లోనూ సభ్యత్వం ఆశించినంతగా లేదని కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుల పనితీరు సరిగా లేదని, సభ్యత్వ నమోదుపై నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకోసం పనిచేయకుండా పదవులు మాత్రమే కావాలంటే సరికాదని, అలసత్వం చూపిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30నాటికి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తిచేయాలని, జాబితాలను సీడీల రూపంలో తయారుచేసి పార్టీ కార్యాలయానికి అందించాలని కుంతియా ఆదేశించారు.