
న్యూఢిల్లీ: కాంగ్రెస్ గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన దేశవ్యాప్త డిజిటల్ మెంబర్‌షిప్ డ్రైవ్ శుక్రవారంతో ముగిసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ తదితర ప్రముఖులు సహా 2.6 కోట్లమంది డిజిటల్ సభ్యులుగా నమోదయ్యారు. 2022–27 సంవత్సరాలకు పార్టీ సభ్యత్వ నమోదును రాతపూర్వక రశీదులతోపాటు డిజిటల్‌గాను ఈసారి కాంగ్రెస్ చేపట్టింది.
దేశవ్యాప్తంగా 5 లక్షల మంది పార్టీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ మెంబర్‌షిప్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment