సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపా మున్షి కూడా ఉన్నారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాకు రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపైనా చర్చించినట్లు సమాచారం.
ఎన్నికల వ్యూహాలు, పార్టీ ప్రచార సభలపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనియా, రాహుల్, ప్రియాంక ప్రచార సభలపై చర్చించిన రేవంత్.. తెలంగాణలో వందరోజుల పాలనపై అధిష్టానానికి వివరించినట్లు తెలుస్తోంది. టీవల కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఖరారు అంశంపై చర్చించినట్లు వినికిడి.
రేపు(మంగళవారం) కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్నీ సమాఏశంలో ఎన్నికల మేనిఫెస్టోతో పాటు..దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్ధులను ఖరారు.. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందాలకు ఆమోద ముద్ర వేసే అవకాశముంది. ఇక రేపు కాంగ్రెస్ జాబితా రానుండటంతో రేవంత్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment