వంద దాటిన డీసీసీబీ సభ్యత్వం
వంద దాటిన డీసీసీబీ సభ్యత్వం
Published Thu, Mar 9 2017 10:41 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- తాజాగా 4 రైతు సేవా సహకార సంఘాలకు సభ్యత్వం
- రూ.11కోట్లకుపైగా డిపాజిట్లు
- డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కేంద్రసహకార బ్యాంకులో మరో నాలుగు రైతు సేవ సహకార సంఘాలకు సభ్యత్వం లభించింది. ఇప్పటి వరకు ఈ బ్యాంకులో 95 సహకార సంఘాలు, 4 జాయింట్ పార్మింగ్ కో ఆపరేటివ్ సొసైటీలకు మొత్తంగా 99 సంఘాలకు సభ్యత్వం ఉంది. తాజాగా ఎర్రగుంట్ల, పాములపాడు, పెద్దహరివానం, రామదుర్గం రైతు సేవా సహకార సంఘాల (ఫార్మర్స్ సర్వీస్ కో ఆపరేటివ్ సొసైటీ)కు సభ్యత్వం ఇవ్వడంతో 103కు చేరిందని కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంతవరకు ఈ సంఘాలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. గురువారం ఏపీజీబీ కర్నూలు రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్, నంద్యాల రీజినల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి వీటిని డీసీసీబీకి అప్పగించారు.
ఈ సంఘాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని చైర్మన్ తెలిపారు. వీటిలో జనవరి 31నాటికి ఎర్రగుంట్ల సంఘం ఆదాయం రూ.165.34 లక్షలు, పాములపాడు రూ.39.26 లక్షలు, పెద్దహరివానం రూ.79.80గా ఉందన్నారు. వీటికి డీసీసీబీలో సభ్యత్వం ఇవ్వడం వల్ల బ్యాంకుకు రూ.11కోట్లకుపైగా డిపాజిట్‌లు రానున్నాయని తెలిపారు. ఈ సంఘాలను అన్ని విధాలా ఆదకుంటామన్నారు. కేడీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ.. సభ్యులు పెరగడంతో బ్యాంకు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్, శివలీల తదితరులు పాల్గొన్నారు.
Advertisement