‘అణు’ సభ్యత్వం తథ్యం కానీ..
బైలైన్
అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో స్థానం సంపాదిం చాలన్న మన ప్రయత్నంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు సమస్య ‘ఇవ్వాలా’ కాదు, ‘ఎన్నడు’ అనేది. గత ఏడాదిగా భారత్‌ను సమర్థిస్తూ, అనుకూల ప్రభావాన్ని కలుగజేస్తున్న అమెరికా, అది ఈ ఏడాది చివరికే జరుగుతుందని విశ్వసిస్తోంది. భారత్ సభ్యత్వం అంశం చర్చకు వచ్చిన సియోల్ ప్లీనరీ జరిగిన తర్వాత శ్వేతసౌధమే అది తెలిపింది. అంతిమ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది.
ఒకప్పుడు మన దేశ అణు కార్యక్రమం పట్ల జాగరూ కతతోనో లేదా వ్యతిరేకతతోనో ఉండిన కెనడా వంటి దేశాలు ఎన్‌ఎస్‌జీ సమావేశానికి ముందు... మన దేశానికి ప్రాధ్యాన్యతా ప్రాతిపదికపై ప్రవేశం కల్పించాలని బహిరం గంగానే వాదించాయి. అవి ఉపయోగించిన పదం ‘‘అతి త్వరగా’’. బ్రిటన్, ఫ్రాన్స్, మాస్కో ప్రభుత్వాలు కల్పించిన ఆటంకం ఏమైనా ఉందంటే అదే. విస్పష్టమైన లక్ష్యాల కోసం అలుపెరగని శక్తిసామర్థ్యాలతో, ఆత్మవిశ్వాసంతో. అంతర్జాతీయ ప్రమాణాల మందకొడి గమనానికి బదు లుగా మన కాలానుగుణ ప్రణాళిక ప్రకారం కృషిని సాగిం చడం మన దౌత్యంలోని నూతన పరిణామం. ఇప్పుడు చైనా తప్ప అన్ని ప్రధాన అణుశక్తులూ మన దేశాన్ని ఎన్‌ఎస్‌జీలో చేర్చుకోవాలని కోరుతున్నాయంటే అది ఈ నూతన పరిణామం వల్ల కలిగిన లాభమే తప్ప, యాదృచ్ఛికంగా కలిగినదేమీ కాదు.
అంతర్జాతీయ బహుముఖ సంస్థలలో ఏకా భిప్రాయం ఏర్పడటం అవసరమైన ఇలాంటి అంశాలను నిర్వచించకుండా వదిలేసిన కాలమనే బహిరంగ ప్రదేశం లోకి తోసేయడం సంప్రదాయకంగా జరుగుతుంటుంది. యథాతథ స్థితి కన్నా దౌత్యపరమైన ప్రశాంతత మెరుగని చెప్పనవసరం లేదు. క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎమ్‌టీసీఆర్) విషయంలో నెలకొన్న అంతర్జాతీయ జడత్వాన్ని మిత్రుల సహాయంతో ఈ నెల మొదట్లో అధిగ మించాం. 2030 నాటికి 40 శాతం కర్బనేతర విద్యుదు త్పత్తికి కట్టుబడతామని మనం గత ఏడాది పారిస్‌లో వాతా వరణ మార్పుల విషయమై హామీ ఇచ్చాం. ఆ హామీని సైతం ప్రస్తావిస్తూ అతి జాగ్రత్తగా రూపొందించిన వాద నతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌ఎస్‌జీ విషయంలోని యథాతథ స్థితిని సవాలు చేశారు. శ క్తివంతమైన ఆ వాదన బలమైన శత్రువులను సైతం మిత్రులుగా మార్చింది. భారత్ తన శక్తికి మించి మరీ వాతావరణ మార్పుల విష యంలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ప్రపంచం కూడా భారత అణు వ్యాపారానికి మద్దతును తెలిపితీరాలి అనే తర్కాన్ని వారు అర్థం చేసుకున్నారు.
ఇక రెండవ కారణం, అణ్వస్త్రవ్యాప్తి నిరోధకత విష యంలో భారత్‌కు ఉన్న చరిత్ర. చైనా ప్రతిఘటనను ‘‘విధి విధానాలకు సంబంధించిన అటంకాలు’’ అన్నారని మనకు తెలుసు. అవి, పాకిస్తాన్‌తో తనకున్న వ్యూహాత్మక మైత్రిని పరిరక్షించుకోవాలనే చైనా కోరిక ఫలితం. మిగతా అణు శక్తులలో చేరడానికి ముందు భారత్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేసి తీరాలనేది చైనా లాంఛనప్రాయమైన అభ్యంతరం. అణుశక్తులైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ వాదనను అంగీకరించడానికి ఎందుకు తిరస్కరించాయి? అణువ్యాప్తి నిరోధం విష యంలో భారత్‌ది మచ్చలేని చరిత్ర కాబట్టి. 1950ల నుంచి అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్న భారత్‌కు వ్యతిరేకంగా ఎన్నడూ ఏ చిన్న గుసగుస వినిపించ లేదు.
అందుకు విరుద్ధంగా పాకిస్తాన్‌కు అణువ్యాప్తి చెందిం చిన చరిత్ర ఉన్నది. 2002 స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసం గంలో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పాకిస్తాన్‌ను అణు ముప్పు ఉన్న ప్రాంతంగా పేర్కొన్నారు. అడ్రియన్ లెవీ అండ్ కాథరిన్ స్కాట్-క్లార్క్‌లు రచించిన డిసెప్షన్: పాకిస్తాన్, ది యునెటైడ్ స్టేట్స్ అండ్ ది గ్లోబల్ న్యూక్లియార్ వెపన్స్ కాన్‌స్పిరసీ అనే పుస్తకం ఈ అంశంపై ప్రామాణి కమైనది. ఆ పుస్తకం కవర్ పేజీ పైనే ‘‘అమెరికా సహా యంతో, సాంకేతికతను ఇతర దేశాలకు అందించడం ద్వారా, పునరుజ్జీవితమైన తాలిబన్‌కు, అల్‌కాయిదాకు ఆశ్రయం కల్పించడం ద్వారా భారీ అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకుని పాకిస్తాన్ నిజానికి పాశ్చాత్య దేశాలను వంచిం చింది’’ అని ప్రముఖంగా ముద్రించి ఉంటుంది. ‘‘టైఫాయిడ్ మర్ఫీ’’ మారుపేరున్న డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ డబ్బుకు ఆశపడి... కొన్నిసార్లు ఆ దురాశకు భావ జాలం ముసుగుతొడిగి మరీ అణు రహస్యాలను అమ్మేశాడు.
ఒక అసాధారణమైన డాక్యుమెంటు ఫలితంగా ఖాన్ 2004 ఫిబ్రవరి 4న బహిరంగంగా ఆ విషయాన్ని టెలివి జన్‌లో అంగీకరించాల్సివచ్చింది. లిబియా, ఉత్తర కొరి యాల వంటి ఖాతాదార్లకు అణు సాంకేతికతను అమ్ముతూ ఖాన్ అణు బ్లాక్ మార్కెట్‌ను నడిపాడు. ఆయన ఇది ఒంటరిగా చేసి ఉండరనేది స్పష్టమే. కానీ సైన్యం చేత తప్పు చేసినవాడిగా ముద్ర వేయించుకున్నాడు. ‘‘ఖాన్ తన తప్పును అంగీకరించాడు, ఆయన అత్యున్నత సహాయకు లకు అణు వ్యాపారం లేకుండా పోయింది’’ అని నాటి అధ్యక్షుడు బుష్ అన్నారు. ‘‘ఖాన్ నెట్‌వర్క్‌కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్నంతా పంచుకుంటానని, తమ దేశాన్ని తిరిగి మరెన్నడూ అణు వ్యాప్తికి వనరును కానిచ్చేది లేదని అధ్యక్షుడు ముష్రాఫ్ వాగ్దానం చేశారు’’ అని కూడా తెలిపారు. పాకిస్తాన్ అధ్యక్షుడు సైతం తన దేశం తప్పు చేసిందని అంగీకరించాల్సి వచ్చింది. ఖాన్‌కు నగదు రూపం లోనూ, భౌతికంగానూ కూడా చెల్లింపులు జరిగాయి. అతడ్ని జైలుకు పంపడానికి బదులు ఆ డబ్బునంతా ఆయననే ఉంచుకోనిచ్చి, ప్రశాంతంగా పదవీ విరమణానం తర జీవితం గడపమని పంపేశారు.
దీనికి విరుద్ధంగా భారత్ ‘‘అణ్వాయుధ వ్యాప్తి నిరో ధక ఒప్పందంలోని నిబంధనలను, లక్ష్యాలను సాధ్యమై నంత విశాలమైన రీతిలో అమలుపరచడానికి’’ సహకరిం చిందని ఎన్‌ఎస్‌జీ 2008లో పేర్కొంది. ఇంతకంటే ఎక్కు వగా చెప్పాల్సినది, ప్రత్యేకించి ఎన్‌ఎస్‌జీకి సంబంధించి ఏమీ లేదు. పాకిస్తాన్‌ను కాపాడటం కోసం భారత్‌కు వ్యతిరేకంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధం సమస్యను లేవనె త్తడం పూర్తి పరిహాసోక్తి కాకపోయినా, గొప్ప వైచిత్రి అవుతుంది. చైనా అభ్యంతరం సైతం సభ్యత్వ క్రమానికి సంబంధిం చినదే తప్ప మన దేశ అర్హతకు సంబంధించి నది కాకపో వడం కూడా భారత్ విశ్వసనీయతపై సందేహం లేదనే దానికి ఆధారం.
దౌత్యం ఒక సుదీర్ఘ క్రీడ. క్షిపణి సాంకేతికత వంటి విష యాల్లో మనం ఫలితాలను వెంటనే సాధించగలుగుతాం. ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కేవలం కాలానికి సంబంధించిన సమస్యే, అది కూడా చాలా ఎక్కువ కాలమేమీ కాదు.
వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు)
పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి