
టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాలయ్య
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శనివారమిక్కడ బాలకృష్ణ టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి పేరు నమోదు చేయించుకున్నారు. గత ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే.