బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ప్రారంభం | bjpmembership started held through online in telangana | Sakshi
Sakshi News home page

బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ప్రారంభం

Published Mon, Jan 12 2015 1:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ప్రారంభం - Sakshi

బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ప్రారంభం

హైదరాబాద్ : గ్రేటర్ లో బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ను సోమవారం కేంద్ర కార్మిక శాఖమంత్రి దత్తాత్రేయ , రాష్ట్ర అధ్యక్షుడుకిషన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... అన్నిరాష్ట్రాల్లోను బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని తెలపారు. మోదీ సర్కార్ వల్ల ప్రపంచంలో భారత్ కు గుర్తింపు వస్తోందన్నారు.

100 మంది సభ్యులను చేర్పిస్తే క్రియాశీలక సభ్యత్వం ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 35 లక్షలకు పైగా సభ్యలను చేర్చడమే బీజేపీ లక్ష్యమన్నారు.  మార్చి 31 దాకా పార్టీ సభ్యత్వం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement