సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
(ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?)
అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
(ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్)
అసలేం జరిగిందంటే..
సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment