ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ ధరల్ని పెంచాయి. ఇప్పుడు అమెజాన్ సైతం త్వరలో ప్రైమ్ ధరల్ని భారీగా పెంచనున్నట్లు తెలిపింది.
అమెజాన్ సైతం ముందస్తుగానే 'లాస్ట్ ఛాన్స్ జాయిన్ ప్రైమ్' పేరుతో యాడ్‌ను ప్రమోట్ చేయడంతో ప్రైమ్ ధరలు పెరిగడం నిజమేనని ప్రైమ్ వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రైమ్ ధర సంవత్సరానికి రూ.999 ఉండగా..పెరగనున్న ధరతో ప్రైమ్ ధరతో రూ.1,499కి చేరనుంది.
పెరగనున్న ప్రైమ్ ధరలు ఎలా ఉన్నాయి
త్వరలో పెరుగుతున్న ప్రైమ్ ధరల్ని చూసుకుంటే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి పెరగనుంది.
క్వార్టల్లీ సబ్ స్క్రిప్షన్ ధర రూ.329 ఉండగా రూ.359కి పెరగనుంది.
యానువల్ సబ్ స్క్రిప్షన్ ధర రూ.1,499కి పెరగనుంది.
అమెజాన్ ప్రైమ్‌తో ప్రయోజనాలు
అర్హత ఉన్న వస్తువులపై అపరిమిత సంఖ్యలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉచితంగా డెలివరీ.
ప్రైమ్ వీడియో,మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్.
అమెజాన్, ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 5శాతం రివార్డ్ పాయింట్లు.
ఆఫర్ సేల్ సమయంలో ప్రైమ్ మెంబర్లు 30 నిమిషాల ముందుగా బుక్ చేసుకోవచ్చు.
చదవండి: Netflix: నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..!
Comments
Please login to add a commentAdd a comment