కాంగ్రెస్‌ సభ్యత్వాల లక్ష్యం 4 లక్షలు | target of Congress membership is 4 lakhs | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సభ్యత్వాల లక్ష్యం 4 లక్షలు

Published Sun, May 7 2017 11:35 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ సభ్యత్వాల లక్ష్యం 4 లక్షలు - Sakshi

కాంగ్రెస్‌ సభ్యత్వాల లక్ష్యం 4 లక్షలు

డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ
కాకినాడ : జిల్లాలో నాలుగు లక్షల పార్టీ సభ్యత్వాలు చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ తెలిపారు. స్థానిక కళావెంకట్రావు భవనంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు ఈనెల 15 నాటికి సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. రెండు నెలలుగా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని చెప్పారు. దళితులు, మహిళల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. బీజేపీ, టీడీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్‌ పార్టీపై ఆదరణ చూపిస్తున్నారన్నారు. బూత్‌ స్థాయిలో 50 మంది చొప్పున సభ్యత్వాలు చేర్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మల దొరబాబు, అంకం గోపి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఎన్‌వీ శ్రీనివాస్, ఒంటెద్దు బాబి, గంగిరెడ్డి త్రినా«థ్‌, నియోజకవర్గాల పరిశీలకులు దుళ్ల ఏడుకొండలు, మచ్చా అప్పాజీ, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి అయితాబత్తుల సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement