కాజల్ పారితోషికం రెండున్నర కోట్లా? | kajal remmunaration two crore? | Sakshi
Sakshi News home page

కాజల్ పారితోషికం రెండున్నర కోట్లా?

Published Wed, Jan 20 2016 1:58 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

కాజల్ పారితోషికం రెండున్నర కోట్లా? - Sakshi

కాజల్ పారితోషికం రెండున్నర కోట్లా?

అనూహ్య అవకాశాలు నటి కాజల్‌అగర్వాల్‌ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విజయ్, విక్రమ్, జీవా అంటూ ప్రముఖ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాలు కాజల్‌ను వరించడం విశేషం. ఇప్పటికే జీవాతో కవలై వేండామ్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో విక్రమ్, విజయ్‌లతో జత కట్టనున్నారు. విజయ్‌తో నటించనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
 
 భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఇది విజయ్‌కి 60వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. చిత్ర నిర్మాత భారతీరెడ్డి,సమర్పకులు బీ.వెంకట్రామరెడ్డి, దర్శకుడు భరతన్, సంగీత దర్శకుడు సంతోష్‌నారనణ్ మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తెరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ త్వరలో తన తాజా చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు.
 
  ఇందులో ఆయన సరసన నటిస్తున్న కాజల్‌అగర్వాల్ రెండున్నర కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అంతే కాదు ఈ చిత్రానికి కాజల్‌ను విజయ్‌నే సిఫార్సు చేసినట్లు, అందుకే ఆమె అంత పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే కాజల్ మాత్రం పిచ్చపిచ్చగా ఫ్రీగా ప్రచారం పొందేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement