
కిచెన్ టిప్స్
మామిడి ఊరగాయ చట్నీ ఎర్రగా కనిపించాలంటే పోపులో చిటికెడు బేకింగ్ సోడా కలపాలి.
మామిడి ఊరగాయ చట్నీ ఎర్రగా కనిపించాలంటే పోపులో చిటికెడు బేకింగ్ సోడా కలపాలి. ఎండుమిరపకాయల్లో ఉప్పు, వేరుసెనగ నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి.బంగాళదుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేప ఆకులు వేసి ఉంచాలి. అరటిపండును ప్లాస్టిక్ ప్యాక్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే తొక్క నల్లబడక పండు తాజాగా ఉంటుంది.
వర్షాకాలం ఒకోసారి పెరుగు తొందరగా తోడుకోదు. అలాంటప్పుడు ఆ పాలగిన్నెను ఫ్రిజ్ స్టెబిలైజర్‌పై ఉంచితే పెరుగు త్వరగా తోడుకుంటుంది. చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి. వర్షాకాలంలో సోంపుగింజలు, గసగసాలు, నువ్వులు వంటి వాటిని వేయించి భద్రపరుచుకుంటే అవి త్వరగా పురుగుపట్టవు.