బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! | Amazing Medicinal Benefits Of Bay Leaves | Sakshi
Sakshi News home page

బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..! ఆ సమస్యలు దూరం..!

Published Sun, Aug 25 2024 11:57 AM | Last Updated on Sun, Aug 25 2024 12:09 PM

Amazing Medicinal Benefits Of Bay Leaves

బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. బిర్యానీకి మంచి ఫ్లేవర్‌ని ఇచ్చే బిర్యానీ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే ఉప్మాలో కరివేపాకులా బిర్యానీలో వచ్చే బిర్యానీ ఆకును ఏరిపారేయడమే. కానీ వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని తెలుసా?  

బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్స్‌ ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే కడుపు నొప్పి, జలుబు, తలనొప్పి వంటి సమస్యల్ని  దూరం చేస్తాయి. వీటితో ఇంకేం లాభాలున్నాయంటే..

డీ టాక్సిఫికేషన్‌
మూత్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బాడీ టాక్సిసిటీ తగ్గుతుంది.  కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది.

యాంటీ క్యాన్సర్‌ గుణాలు..
బిర్యానీ ఆకుల్లో యాంటీ క్యాన్సర్‌ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని క్యాన్సర్‌ సెల్స్‌ తగ్గుతాయి. దీంతో క్యాన్సర్‌ వంటి సమస్యల్ని ముందు నుంచే తగ్గించుకోవచ్చు. అంతేకాదు. వీటిలో ఉండే విటమిన్‌ సి, విటమిన్‌ ఈ, కెరోటినాయిడ్స్‌ బ్లడ్‌ కొలెస్ట్రాల్, యూరిక్‌ యాసిడ్‌ లెవల్స్‌ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు, ఫైటోకెమికల్స్‌ ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. దీంతోపాటు లివర్, కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి.

డయాబెటిస్‌..
బిర్యానీ ఆకులో ఉండే ఫైటో కెమికల్స్‌ షుగర్‌ ఉన్న వారికి చాలా మంచిది. దీనిని తీసుకుంటే టైప్‌ 2 డయాబెటిస్‌ తగ్గుతుంది.

గుండె ఆరోగ్యానికి..
పరిశోధనల ప్రకారం బిర్యానీ ఆకుల్లోని కొన్ని ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ గుండె గోడలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.

ఎలా తీసుకోవాలి?
బిర్యానీ ఆకుల్ని టీలా చేసుకుని తాగొచ్చు. దీనికోసం నీటిలో బిర్యానీ ఆకుల్ని వేసి మరిగించి తాగొచ్చు. అందులో దాల్చిన చెక్క వేస్తే మరీ మంచిది. 

(చదవండి: బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్‌!..అనుభవాన్ని షేర్‌ చేసుకున్న రోహిత్‌ రాయ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement