‘ఇప్పటికే నాకు ఆరుగురు ఆడ పిల్లలు పుట్టారు. మళ్ల అమ్మాయే పుట్టింది. మా అత్త నన్నెంతో ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ పని చేస్తున్నాను. మీకు అనుకూలంగా ఉంటే నా కుమార్తెను పెంచండి. నన్ను క్షమించండి’.. అత్యంత నిస్సహాయ పరిస్థితిలో ఒక మాతృమూర్తి చేసుకున్న అక్షర వేదన ఇది. ఆ తల్లి తన నవజాత ఆడ శిశువును ఒంటరిగా ఆ మహిళా ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది.
ఆమెకు ఇప్పటికే ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏడవ సంతానం కూడా ఆడపిల్లే కలిగింది. అత్తింటిలో పోరు పడలేక ఆ మహిళ తన కుమార్తెను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆమె ఒక లెటర్‌ను కూడా అక్కడ ఉంచింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాగా ఆసుపత్రిలో రోదిస్తున్న శిశువును గమనించిన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అలాగే ఆ చిన్నారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేశారు.
ఈ ఉదంతం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. నవజాత శిశువును వైద్యులు వార్డుకు తరలించారు.ఈ సందర్భంగా భరత్‌పూర్ జనతా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హిమాంశు గోయల్ మాట్లాడుతూ ఈ చిన్నారి 3 రోజుల క్రితమే జన్మించిందని అన్నారు. చిన్నారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: అది చరిత్రలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Comments
Please login to add a commentAdd a comment