- ఎస్‌టీయూ డిమాండ్
సెలవుల నిర్ణయాధికారం హెచ్‌ఎంలకు ఇవ్వాలి
Published Sun, Nov 6 2016 9:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
భానుగుడి (కాకినాడ) :
పాఠశాలల్లో స్థానిక సెలవుల నిర్ణయాధికారాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాలకే ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియ¯ŒS జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్‌టీయూ భవ¯ŒS ఆదివారం సమావేశమైన కార్యవర్గ సభ్యులు ఈ విషయమై తీర్మానం చేశారు. దీనిపై డీఈఓ స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇప్పటివరకు సెలవుల నిర్ణయాధికారం ఎంఈఓ లేదా డీవైఈఓల ప్రత్యేక అనుమతితో తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై ఉపా«ధ్యాయులకు సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఈ నిబంధనను మార్చాలని కోరింది. దీనిపై డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని, ఆయన స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌టీయూ జిల్లా అ««దl్యక్షుడు పి.సుబ్బరాజు తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.శేఖర్, కార్యవర్గ సభ్యులు పి.రాంబాబు, ఎం.శివప్రసాద్, డి.వెంకటరావ్, పి.వి.వి.సత్యనారాయణరాజు, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement